Bangladesh Election : బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం.. తదుపరి ప్రధాని అతనేనా!
Bangladesh Election : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తరువాత జరిగిన ఈ ఎన్నికల్లో బీఎన్‌పీ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
- Harish Thanniru
- Published on- February 13, 2026 / 08:36 AM IST
Tarique Rahman
- బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం
- మిత్రపక్షాలతో కలిసి 211 స్థానాల్లో విజయం సాధించినట్లు వెల్లడి
- బంగ్లాదేశ్ తదుపరి ప్రధానిగా తారిఖ్ రహ్మాన్
Bangladesh Election : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తరువాత జరిగిన ఈ ఎన్నికల్లో బీఎన్‌పీ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్ లో మిత్రపక్షాలతో కలిపి 211 స్థానాల్లో బీఎన్‌పీ విజయం సాధించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో బీఎన్‌పీ చైర్ పర్సన్ ఖాలిదా జియా కుమారుడైన తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఇక జమాత్-ఎ- ఇస్లామీ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధించింది.
Also Read : చైనా, పాక్ ఉలిక్కిపడేలా భారత్ కీలక నిర్ణయం.. ఏకంగా 114 రాఫెల్ యుద్ధ విమానాలు..
బీఎన్‌పీ అధినేత తారిఖ్ రెహ్మాన్ ఢాక్-17, బోగ్రా-6 నియోజకవర్గాల నుండి భారీ మెజార్టీతో విజయం సాధించి తన సత్తా చాటారు. సుదీర్ఘకాలం పాటు ప్రవాసంలో ఉన్న ఆయన.. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చి పార్టీని విజయపథంలో నడిపించారు. సుదీర్ఘకాలం పాటు ప్రవాసంలో ఉన్న ఆయన, ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చి పార్టీని విజయపథంలో నడిపించారు. బీఎన్‌పీ కూటమి అధికారంలోకి వస్తే తారిఖ్ రెహ్మానే తదుపరి ప్రధానమంత్రి అవుతారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.
