Bangladesh lock down : వార్ ఎఫెక్ట్.. లాక్‌డౌన్ షురూ..! సాయంత్రం 6గంటల వరకే షాపులు.. పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు.. అవన్నీ ఇక బంద్..
Bangladesh lock down : ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో బంగ్లాదేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ తరహా నిబంధనలు విధించింది.
- Harishth Thanniru
- Published On : April 4, 2026 / 08:12 AM IST
Bangladesh lockdown
- బంగ్లాదేశ్‌పై ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్
- బంగ్లాదేశ్‌లో విద్యుత్ సరఫరాపై తీవ్ర ఒత్తిడి
- ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు కొత్త రూల్స్
- లాక్‌డౌన్ తరహాలో బంగ్లా సర్కార్ నిబంధనలు
Bangladesh lock down : ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యుద్ధం కారణంగా చమురులు, గ్యాస్ సరఫరా నిలిచిపోతుంది. దీంతో ప్రపంచంలోని భారత్ సహా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తోపాటు పలు దేశాల్లోని ప్రజలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశంలో లాక్ డౌన్ ప్రకటించింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్ లోని ప్రజలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కఠినమైన పొదుపు చర్యలను ప్రకటించింది. అంటే దాదాపు లాక్ డౌన్ నిబంధనలు విధించింది. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లను అస్తవ్యస్తం చేయడంతోపాటు బంగ్లాదేశ్‌లో విద్యుత్ సరఫరాపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. దీంతో ఇంధన వినియోగాన్ని నియంత్రించడం కోసం ఆ దేశ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కార్యాలయ పనివేళలను తగ్గించడం, ప్రభుత్వ వ్యయాలను నియంత్రించడం వంటి చర్యలు చేపట్టింది.
కొత్తనిబంధనల ప్రకారం.. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంకోసం ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. మార్కెట్లు, షాపింగ్ సెంటర్లను సాయంత్రం 6 గంటల కల్లా మూసివేయాలి. దీంతోపాటు పరిశ్రమలలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం కోరింది. విద్యామంత్రిత్వశాఖ ఆదివారం నుంచి పాఠశాలలకు మార్గ దర్శకాలను జారీ చేయనుంది. ఇందులో భాగంగా టైమ్‌టేబుల్స్ సర్దుబాటు చేయడం, ఆన్‌లైన్ తరగతులకు మారడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీ లిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల సుంకరహిత దిగుమ తులను కూడా అనుమ తిస్తున్నారు. ఇప్పటికే ఇంధనాన్ని రేషన్ పద్ధతిలో పంపిణీ చేయడంతో పాటు, వాహనాల అమ్మకాలను ప్రభుత్వం పరిమితం చేసింది.
