Bangladesh first transgender newsreader : సమాజంలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ వివక్షను ఎదుర్కొంటోంది. సంప్రదాయేతర విద్య, సంప్రదాయవాద సమాజం లేకపోవడం వల్ల సమాజం నుంచి వెలివేతకు గురవుతున్న పరిస్థితి. బంగ్లాదేశ్‌లో ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో చిన్నచూపు.. ఈ ధోరణితో చాలామంది ట్రాన్స్ జెండర్లు తరచూ వివక్షను ఎదుర్కొంటూ తీవ్ర పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక ట్రాన్స్ జెండర్.. టెలివిజన్ తెరపై మెరిసింది.
ఆ దేశంలో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ న్యూస్ యాంకర్ కూడా ఆమె అవతరించింది. ఇకనైనా తమ కమ్యూనిటీకి చెందిన వారంతా వివక్ష నుంచి బయటపడతారని ఆశిస్తున్నానని, సమాజం తమను వారిలో ఒకరిగా అంగీకరిస్తుందని భావిస్తున్నానంటోంది. ఆమె ఎవరో కాదు.. Tashnuva Anan.. సామాజిక కార్యకర్త కూడా. గతంలో ట్రాన్స్ జెండర్లు, వలసవాదులకు మద్దతుగా ఎన్జీవోతో కలిసి పనిచేసింది.
కానీ, ఎల్జీబీటీ ప్లస్ రైట్స్ క్యాంపయినర్లు మాత్రం.. బంగ్లాలో 160మిలియన్ల జనాభాలో వాస్తవానికి కనీసం లక్ష మంది వరకు ట్రాన్స్ జెండర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. చాలామంది ట్రాన్స్ జెండర్లు చిన్నతనంలోనే కుటుంబాల నుంచి వెలివేతకు గురైనవారే ఎక్కువ మంది ఉన్నారు. సరైన విద్య లేకపోవడంతో ఉద్యోగులు రాక తీవ్ర పేదరికంలో మగ్గిపోతున్నారని సామాజిక కార్యకర్తలు వాపోతున్నారు. ట్రాన్స్ జెండర్లు కూడా మనుషులేనని, వారికి కూడా విద్య హక్కు ఉందని అంటున్నారు. సమాజంలో అందరితోపాటు తాము గౌరవప్రదమైన జీవితం గడపాలని కోరుకుంటారని అలాంటి పరిస్థితులు త్వరలోనే వస్తాయని కోరుకుంటున్నామని అనన్ తెలిపింది.