Beauty Queen And Russian Soldier Claims She Was Fired Due To Jealousy : రష్యా సైన్యంలో ఆమె వెరీ స్పెషల్. ఎందుకంటే ఆమె చాలా చాలా అందగత్తె. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించేంత అందం ఆమె సొంతం. రష్యా నేషనల్ గార్డ్స్ లో సైనికురాలిగా పనిచేసే ఆ అందాల సుందరాంగి పేరు ‘‘అన్నా ఖ్రమత్సోవా’’. ఆమెను ఉన్నతాధికారులు ఉద్యోగంలోంచి తీసివేశారు.
దానికి కారణం తాను అందంగా ఉంటానని తాను అందగత్తెల పోటీల్లో పాల్గొ వెయ్యి మందిలో విజేతగా నిలిచానని ఆ సమయంలో తాను బికినీ ధరించాలనే సాకుతో తనను ఉద్యోగంనుంచి తీసివేశారని ఆమె అధికారులపై ఆరోపణలు చేస్తోంది. కానీ అది కారణం కాదంటున్నారు అధికారులు. మరి ఆ అపురూప సౌందర్యవతి విషమేంటంటే..
రష్యా సైన్యంలోనే అన్నా ఖ్రమత్సోవా అపురూప సౌందర్యవతి. అందాల పోటీలో పాల్గొని వెయ్యి మందిలో నిలిచి గెలిచిన అందగత్తె ఆమె. కానీ..ఆమెను రష్యా సైన్యం ఉద్యోగం నుంచి తీసివేసింది. దీనిపై అన్నా ఖ్రమత్సోవా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. తాను చాలా ఇష్టంతో కష్టపడి ఈ ఉద్యోగంలో చేరానని కానీ తన అందమే తనకు శాపమైందనీ..ఓ వర్గం తనపై అసూయతోనే నన్ను ఉద్యోగం నుంచి తొలగించేశారని ఆరోపించింది. ఇక్కడ గమనించాల్సిన మరో విశేషమేంటంటే..అన్నా ఖ్రమత్సోవా తల్లిదండ్రులు..ఆమె కుటుంబ సభ్యులంతా సైన్యంలోనే పనిచేస్తున్నారు.
అన్నా ఖ్రమత్సోవా రష్యా నేషనల్ గార్డ్స్ లో సైనికురాలిగా పనిచేస్తోంది. ఇటీవల నేషనల్ గార్డ్స్ నిర్వహించిన అందగత్తెల పోటీల్లో పాల్గొంది. 1000 మందిలో విజేతగా నిలిచింది. ఆమె గెలుపుతో దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంతర్గత సైనిక బృందంలోని మహిళా సైనికులకు తనపై ఈర్ష్య పెరిగిందనీ తాను ఈ పోటీలో గెలిచాననే అక్కసుతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేసి బలగాల నుంచి తప్పించేలా చేశారని ఖ్రమత్సోవా ఆరోపించింది.
పోటీలో తాను విజేతగా నిలిచి నాటినుంచి తనను వేధిస్తున్నారనీ..తనకు శత్రువులు పెరిగారని అన్నా వాపోతోంది. తన అలవాట్లు, ఆటలు, తన లైఫ్ స్టైల్ గురించి పూర్తిగా తెలుసుకుని..తనను బయటకు పంపించేందుకు కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను బికినీల్లో తీసుకున్న ఫొటోలను సాకుగా చూపి ఉద్యోగం నుంచి తీసేశారంటూ ఆరోపిస్తోంది.
ఈ విషయంపై రష్యా సైన్యం ఉన్నతాధికారులు మాత్రం మరోలా అంటున్నారు. ఆమెను ఉద్యోగం నుంచి తీసేయడానికి కారణం ఆమె అందాల పోటీల్లో పాల్గొన్నందుకు కాదు..ఆమె విజేతగా నిలిచినందుకు కాదు..ఆమె అందంగా ఉన్నందుకు కూడా కాదనీ..ఆర్మీ ప్రాంతం, రహస్యాలు తెలిసేలా అన్నా ఖ్రమత్సోవా ఓ వీడియోను పోస్ట్ చేసిందనీ అందుకే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాల్సి వచ్చిందని అంటున్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఎటువంటి చర్యలకైనా వెనుకాడేది లేదని చెబుతున్నారు.
కరోనా సమయంలో ఆర్మీకి సంబంధించిన భవనాన్ని శుద్ధి (డిసిన్ఫెక్షన్) చేస్తున్నప్పుడు తీసిన వీడియోను అన్నా ఖ్రమత్సోవా పోస్ట్ చేసిందంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియోను అధికారులు తొలగించామని చెబుతున్నారు. మరి ఖ్రమత్సోవా చేసిన ఆరోపణల్లో నిజమెంతో..అధికారులు చెబుతున్నదానిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.