Trump Ring: ట్రంప్‌కు ఖరీదైన వజ్రాల ఉంగరం గిఫ్ట్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు! దీని విలువ ఎంతంటే..? ప్రత్యేకతలు ఇవే
Donald Trump Ring : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు బెల్జియం వజ్రాల పరిశ్రమ అత్యంత ఖరీదైన వజ్రాల ఉంగరాన్ని బహుమతిగా అందించింది.
- Harish Thanniru
- Updated on- July 4, 2026 / 12:57 PM IST
Belgian Diamond Industry Gifted Ring to US President Donald Trump
- ట్రంప్‌కు అత్యంత ఖరీదైన ఉంగరం
- 250 ఏళ్ల అమెరికా ఉత్సవాల సందర్భంగా కానుక
- ప్రకటించిన బెల్జియంకు చెందిన ఏడబ్ల్యూడీసీ
Trump Diamond Ring Gift : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు బెల్జియం వజ్రాల పరిశ్రమ అత్యంత ఖరీదైన వజ్రాల ఉంగరాన్ని బహుమతిగా అందించింది. అమెరికా స్వాతంత్ర్యానికి 250ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బ్రస్సెల్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఉంగరాన్ని ఆవిష్కరించారు. అధ్యక్షుడికి 250 ఏళ్ల అమెరికా ఉత్సవాలకు కానుకగా ఇస్తున్నట్లు బెల్జియంకు చెందిన ఆంట్‌వెర్స్ వరల్డ్ డైమండ్ సెంటర్ (ఏడబ్ల్యూటీసీ) ప్రకటించింది. ఏడబ్ల్యూడీసీ నుంచి అమెరికాకు ప్రతీయేటా రూ.16,800 కోట్ల పాలిష్ చేసిన వజ్రాలపై టారిఫ్‌లను రద్దు చేసినందుకే ఈ బహుమానమని ఏడబ్ల్యూడీసీ తెలిపింది.
Also Read – Pakistan : “మీ సమస్య భారత్ కాదు”.. ప్రపంచ వేదికపై పాకిస్థాన్‌కు మాజీ సింగపూర్ రాయబారి స్ట్రాంగ్ కౌంటర్!
ఉగరం ప్రత్యేకతలు.. విలువ?
‘ఫ్రీడం 250’ పేరుతో రూపొందించిన ఈ ఉంగరం 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఇందులో మొత్తం 321 వజ్రాలు, 56 నీలమణులు (సఫైర్లు), 13 పచ్చలు (ఎమరాల్డ్స్), 6 మాణిక్యాలు (రూబీలు) ఉంచారు. ఉంగరంపై అమెరికా జాతీయ పతాకాన్ని సూచించే డిజైన్‌తో పాటు 1776 – 2026 సంవత్సరాలు, 250 YEARS USA అనే పదాలు చెక్కారు. అలాగే ట్రంప్ అధ్యక్ష పదవులను సూచించే 45, 47 సంఖ్యలు.. వజ్రాల రెక్కలు కలిగిన ఒక గరుడ పక్షి కెంపుతో చేసిన డాలును మోస్తూ, పచ్చలు పొదిగిన ఆలివ్ కొమ్మను తన కాళ్లతో పట్టుకొని ఉంది. లోపలి భాగంలో “Crafted in Antwerp for Donald John Trump” అని చెక్కి ఉంది. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఉంగరం విలువను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆభరణాల నిపుణుల అంచనా ప్రకారం.. దీని ధర 25వేల నుంచి 35 వేల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.21 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు) ఉండొచ్చని తెలిపారు.
ఈ ఉంగరాన్ని ఆంట్‌వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ (ఏడబ్ల్యూడీసీ) తరఫున ఆంట్‌వెర్ప్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ డేవిడ్ గాట్‌లిబ్ రూపొందించింది. ఏడబ్ల్యూడీసీ అధ్యక్షుడు ఇసిడోర్ మోర్సెల్ మాట్లాడుతూ.. అమెరికా–బెల్జియం వజ్రాల పరిశ్రమ మధ్య ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యానికి ఈ ఉంగరం ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఇదిలాఉంటే.. ఈ వజ్రపు ఉంగరాన్ని ఇంకా అధ్యక్షుడు ట్రంప్‌కు అందజేయలేదని వైట్‌హౌస్‌లోని ఓ అధికారి తెలిపారు. అయితే, బెల్జియంలోని అమెరికా రాయబారి బిల్ వైట్‌కు ఈ ఉంగరాన్ని అందజేయగా.. ఆయన ద్వారా ట్రంప్‌కు చేరాల్సి ఉంది.
ఇదిలాఉంటే.. ట్రంప్‌కు అత్యంత ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వండంపై అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఖతార్ ప్రభుత్వం నుంచి రూ.3,360 కోట్ల విమానాన్ని ట్రంప్ కానుకగా అందుకున్నారు. అప్పట్లో ట్రంప్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్న ట్రంప్ ఇలాంటి వ్యక్తిగత బహుమతులు స్వీకరించడం నైతిక ప్రమాణాలకు విరుద్ధమని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అమెరికాలోని నిబంధనల ప్రకారం.. విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చే బహుమతులకు ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి. అయితే, ప్రస్తుతం ఈ ఉంగరం ట్రంప్‌కు అధికారికంగా అందిందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. బిల్ వైట్ ఈ ఉంగరాన్ని ధరించి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటికీ, అనంతరం ఆ పోస్టును తొలగించడం మరింత చర్చలకు కారణమైంది.
