మీరు ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఏప్పుడైనా చూశారా..? అదే ‘రఫ్లేసియా తువాన్ ముడే’. ఈ పువ్వు ఇండోనేసియాలో పూసింది. ఇది ఇండోనేసియా జాతీయ పుష్పం కూడా. ఇండోనేసియా, మలయ, బెర్నొయ్, సుమత్రా, ఫిలిప్పీన్స్ అడవుల్లో మాత్రమే ఈ పువ్వులు కనిపిస్తాయి. దీని బరువు 11 కిలోల కన్న ఎక్కువే ఉంటుంది.
అంతేకాదు ఈ పువ్వుకు ఇతర పూవుల్లాగా ఆకులు, కాండం, కొమ్మలు లాంటివి ఉండవు. నేలపై ఉన్న తీగలపైనే ఈ భారీ పూలు పుష్పిస్తాయి. ఇది వికసించటానికి కొన్ని నెలలు పడుతుంది. కానీ, ఒకసారి విచ్చుకుంటే మాత్రం వారం రోజులే ఉంటుంది.
ఎర్రగా, అందంగా, అద్భుతంగా ఉండే ఈ పువ్వు దరిదాపుల్లో నిలబడటం కూడ కష్టమే. ఎందుకంటే.. ఈ పువ్వు కుళ్లిన మాంసం కంపుగొడుతుంది. ఇక ప్రస్తుతం ఈ పువ్వుల్ని ప్రపంచ ప్రసిద్ధ బొటానికల్, నేషనల్ పార్కులన్నింటిలోనూ చూడొచ్చు.