Bill Gates : జెఫ్రీ ఎప్‌స్టీన్ హామీలు నమ్మి మోసపోయా.. అతని పరిచయం వెనుక అసలు కథ చెప్పిన బిల్‌ గేట్స్‌..

Bill Gates : తన వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన వివరాలను ఉపయోగించి జెఫ్రీ ఎప్‌స్టీన్‌ తనను బ్లాక్‌మెయిల్ చేశాడని బిల్ గేట్స్ చెప్పారు.

Bill Gates says Epstein used extramarital affair details to blackmail him

  • ఎప్‌స్టీన్‌ను కలవడమే పొరపాటు
  • అతని హామీలు నమ్మి మోసపోయా
  • తన వ్యక్తిగత సంబంధాలతో ఒత్తిడి తెచ్చాడు
  • అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు

Bill Gates : జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. పలువురు ప్రపంచ ప్రముఖులకు బాలికలను ఎరగావేసి వారి నుంచి అనేక ప్రయోజనాలను ఎప్‌స్టీన్‌ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఎప్‌స్టీన్‌ కేసు విచారణలో భాగంగా వెల్లడైన లక్షల పత్రాల్లో పలుచోట్ల మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రస్తావన ఉండటంతో.. అమెరికా చట్టసభలకు చెందిన హౌస్ ఓవర్ సైట్ కమిటీ ముందు స్వచ్ఛందంగా హాజరైన గేట్స్.. ఎప్‌స్టీన్‌‌తో తన సంబంధాలపై వివరణ ఇచ్చారు.

Also Read : Gold Silver Rate Today : భారీగా పడిపోతున్న బంగారం ధర.. వరుసగా రెండోరోజు ఢమాల్.. రూ.లక్షకు చేరుతుందా? నిపుణులు ఏం చెప్పారంటే..

ఎప్‌స్టీన్‌ కేసుకు సంబంధించిన పత్రాల్లో పలుమార్లు గేట్స్ పేరు ప్రస్తావనకు రావడంతో కమిటీ చైర్మన్ జేమ్స్ కామర్ ఆయన్ను వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. అయితే, గేట్స్ ఎలాంటి తప్పు చేసినట్లు ఆరోపణలు లేవని కామర్ స్పష్టం చేశారు. గేట్స్ తన వాంగ్మూలంలో.. ఎప్‌స్టీన్‌ ను కలవడమే తాను చేసిన పెద్ద పొరపాటని విచారం వ్యక్తం చేశారు. అతని నేర నేపథ్యం తెలియకపోవడం వల్లనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు.

వృత్తిపరమైన, దాతృత్వ సంబంధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొందరు తనను ఎప్‌స్టీన్‌ కు పరిచయం చేశారని, ప్రపంచానికి ప్రయోజనం కలిగించే తన ఆరోగ్య పథకాలకు బిలియన్ల కొద్దీ డాలర్ల విరాళాలు సమకూర్చడంలో సహాయం చేస్తానని అతను తనకు హామీ ఇచ్చాడని గేట్స్ పేర్కొన్నారు. కానీ, అతనివి వట్టిమాలేనని తేలిపోవడంతో 2014లో అతనితో సంబంధాలు తెంచుకున్నానని తెలిపారు. అయితే, ఎప్‌స్టీన్‌ కు సంబంధించిన దీవినిగానీ, అతని ఇతర అపఖ్యాత ఆస్తులను గానీ తాను సందర్శించలేదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు.

అయితే, ఎప్‌స్టీన్‌ తో సంబంధాలు ముగిసిన తరువాత మళ్లీ సంప్రదింపులు కొనసాగించేలా ఒత్తిడి తెచ్చేందుకు తన వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించేందుకు ప్రయత్నించాడని గేట్స్ అన్నారు. ‘నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సున్నితమైన విషయాలు ఎప్‌స్టీన్‌ కు తెలిశాయి. వాటిని ఆధారంగా చేసుకుని నాపై ప్రభావం చూపాలని ప్రయత్నించాడు. కానీ, ఆ విషయాలకు అతనితో నా సంబంధాలకు ఎలాంటి సంబంధం లేదు. అవి నా కుటుంబానికి మాత్రం బాధను కలిగించాయని గేట్స్ పేర్కొన్నారు. అతనితో సమావేశాలు తన ప్రతిష్టకే కాకుండా.. గేట్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపాయని గేట్స్ పేర్కొన్నారు.