Libya Boat Accident : ఘోర పడవ ప్రమాదం.. 57 మంది మృతి!
లిబియాలో పడవ ప్రమాదం జరిగింది. 75 మంది వలసదారులతో లిబియా నుంచి ఐరోపా ఖండంవైపు బయలుదేరిన పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 57 మంది మృతి చెందారు. 18 మంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు.
- kunduru Vinod
- Published On : July 27, 2021 / 10:10 AM IST
Libya Boat Accident
Libya Boat Accident : లిబియాలో పడవ ప్రమాదం జరిగింది. 75 మంది వలసదారులతో లిబియా నుంచి ఐరోపా ఖండంవైపు బయలుదేరిన పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 57 మంది మృతి చెందారు. 18 మంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. పడవ సముద్రంలో మునిగిన వివరాలను యూఎన్ మైగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు.
పడవ లిబియాలోని పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్ నుంచి ఆదివారం బయలుదేరిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి సఫా మెహ్లీ పేర్కొన్నారు. మృతుల్లో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందిన వారున్నారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలోనే పడవ ఆగిపోయిందని, ఆ తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బోల్తాపడిందని తేలింది.
ఇదిలా ఉండగా మరో 500 మంది వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అధికారులు అడ్డుకొని లిబియాకు తరలించారు.
