British PM Boris Johnsonకు శాలరీ ఇబ్బందులు తప్పలేదు. అన్నింటిలో టాప్‌యే అనుకునే దేశ ప్రధానికి కూడా.. లగ్జరీ లైఫ్, పవర్, హోదా లాంటివి ఉన్నప్పటికీ శాలరీ సరిపోక ఇబ్బందులు తప్పడం లేదు. సంవత్సరాధాయం సరిపోక ప్రధాని పోస్టు నుంచి తప్పుకునేందుకు రెడీ అయిపోతున్నారు బోరిస్ జాన్సన్. ఈ మేరకు బ్రిటన్ కు చెందిన డైలీ మిర్రర్ ఓ కథనం ప్రచురించింది.
బ్రెగ్జిట్ తర్వాత జాన్సన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయేందుకు రెడీగా ఉన్నట్లు ఓ పార్లమెంట్ మెంబర్ చెప్పినట్లు వెల్లడించింది. జాన్సన్‌కు ప్రధానిగా వచ్చే వేతనం కంటే.. గతంలో చేసిన ఉద్యోగంలోనే ఎక్కువ జీతం వచ్చేదని ఆయన అభిప్రాయం. గతంలో టెలిగ్రాఫ్ పత్రికలో కాలమిస్టుగా జాబ్ చేసినప్పుడు ఏటా 2.75 లక్షల పౌండ్లు వచ్చేవి. దాంతో పాటుగా నెలకు 2 ప్రసంగాలివ్వడం ద్వారా సుమారు 1.6 లక్షల పౌండ్లు సంపాదించేవారు.
ప్రధాని అయ్యాక 1.5 లక్షల డాలర్లే వేతనంగా పొందుతున్నారు. దీనివల్ల కనీస అవసరాలు కూడా తీరడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు ఆరుగురు పిల్లలతో పాటు.. విడాకులు ఇచ్చిన భార్యకు కూడా భరణం చెల్లిస్తూ ఉండాలి. ఈ ఖర్చులు భరించడానికి తనకు వచ్చే జీతం సరిపోవడం లేదని వాపోతున్నారట.
https://10tv.in/finland-pm-sanna-marin-trolled-for-wearing-low-cut-blazer-others-support-by-sharing-identical-pics/
ప్రస్తుతం ప్రధాని ఇంట్లో కనీసం హౌస్‌కీపర్ కూడా లేదని, అసలా ఇల్లే పెద్ద మురికికూపంగా మారిందని అతని స్నేహితులు చెప్పినట్లు కథనం పేర్కొంది. బోరిస్‌కు ముందు ప్రధానిగా పనిచేసిన థెరిసా మే ప్రస్తుతం లెక్చర్లిస్తూ దాదాపు 10 లక్షల పౌండ్లు వెనకేసినట్లుగా డైలీ మిర్రర్ కథనం వెల్లడించింది.