Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లడంతో 23మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bus Accident : బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్‌బారి జిల్లాలోని దౌలత్‌దియా టెర్మినల్ వద్ద 50మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి దూసుకెళ్లింది.
- Harishth Thanniru
- Published On : March 26, 2026 / 06:49 AM IST
Bus Accident
- బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం
- పద్మ నదిలోకి దూసుకెళ్లిన ప్రయాణికుల బస్సు
- 23మంది మృతి.. పలువురు గల్లంతు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
Bus Accident : బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్ బారి జిల్లాలోని దౌలత్‌దియా టెర్మినల్ వద్ద 50మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read : Steel Plant Credit Fight: ఏపీలో స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ఫైట్.. ఈ పోటీ ఎందుకోసం? ఎవరిది పైచేయి?
ఈద్ సెలవులు ముగించుకొని ఢాకాకు తిరుగుప్రయాణమవుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం సాయత్రం 5గంటల సమయంలో దౌలత్‌దియాలోని ఫెర్రీ టెర్మినల్ నవంబర్ 3 వద్ద బస్సు నదిలోకి దూసుకెళ్లింది. బస్సు రాజ్‌బారి నుండి ఢాకాకు వెళ్తుంది. ప్రమాదం జరిగిన స్థలం ఢాకా నుంచి 128 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు ప్రమాద వివరాలు తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
పోలీస్ ఇన్‌స్పెక్టర్ రస్సెల్ మొల్లా మాట్లాడుతూ.. మేము 23 మృతదేహాలను వెలికితీశాం. ఇంకా కొందరు గల్లంతై ఉండొచ్చు. కొద్దిమంది ప్రాణాలతో బయటపడ్డారు. రాత్రికావడంతో సహాయక చర్యలు కొంతవరకు నిలిచిపోయాయి. అగ్నిమాపక దళం, నౌకాదళం, పోలీసులు, ఇతర బృందాలు సంయుక్తంగా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. గురువారం ఉదయాన్నే సహాయక చర్యలు మళ్లీ ప్రారంభిస్తామని తెలిపారు.
ప్రమాదం జరిగిన బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన అబ్దుల్ అజీజుల్ అనే ప్రమాణికుడు మాట్లాడుతూ.. రాజ్‌బారిలోని కలుఖాలి ఉపజిల్లా నుంచి బస్సు ఎక్కిన. తాను నదిలో ఈదుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నా. నా భార్య, బిడ్డ ఆచూకీ తెలియరాలేదని కన్నీటి పర్యాంతమైయ్యాడు.
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు.
