×
Ad

క్షణాల్లో 9 మంది స్కూల్‌ పిల్లలను ట్రాన్స్‌ వుమన్ ఎందుకు చంపింది? అంతకుముందు తల్లిని, సోదరుడిని కూడా..

తాను గతంలో చదువుకున్న స్కూల్‌కి వెళ్లి విద్యార్థులపై కాల్పులకు తెగబడింది. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడింది.

  • కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలో కాల్పులు
  • టంబ్లర్‌ రిడ్జ్‌లోని ఓ స్కూల్లో 9 మంది పిల్లలు మృతి
  • ట్రాన్స్‌ వుమన్ జెస్సీకి మానసిక సమస్యలు

Canada School Killer: కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా, టంబ్లర్‌ రిడ్జ్‌లోని ఓ స్కూల్లో కాల్పుల కలకలం చెలరేగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ కాల్పులకు తెగబడిన వ్యక్తి వివరాలు తెలిశాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కాల్పులకు పాల్పడింది 18 ఏళ్ల ఓ ట్రాన్స్‌ వుమన్ జెస్సీ వాన్ రూట్సెలార్. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయి. మొదట జెస్సీ వాన్ రూట్సెలార్ తన తల్లిని, సోదరుడిని కాల్చి చంపింది. అనంతరం, తాను గతంలో చదువుకున్న స్కూల్‌కి వెళ్లి విద్యార్థులపై కాల్పులకు తెగబడింది. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఎవరీ షూటర్?
రూట్సెలార్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌ వుమన్. అబ్బాయిగా జన్మించి తర్వాత ట్రాన్స్‌జెండర్‌ వుమన్‌గా మారింది. నాలుగేళ్ల క్రితం టంబ్లర్‌ రిడ్జ్‌లోని అదే స్కూల్‌లో చదువును మధ్యలోనే మానేసింది. ఆమెకు మొదట తుపాకీ లైసెన్స్‌ ఉండేది.

ఆ తర్వాత పోలీసులు దాన్ని క్యాన్సిల్ చేసి, ఆమె ఇంటి నుంచి తుపాకులను తీసుకెళ్లారు. అయితే, మళ్లీ ఆమె వాటిని సంపాదించుకుంది.

రూట్సెలార్‌కు మానసిక సమస్యలు కూడా ఉన్నాయి. రూట్సెలార్‌ ప్రవర్తన కారణంగా ఆమె ఇంటికి పోలీసులు వచ్చి తనిఖీ చేసి వెళ్తుండేవారు.