కరోనా రావడం దేవుడి ఆశీర్వాదం లాంటిది: ట్రంప్

U.S. President Donald Trump కరోనా రావడమంటే దేవుడి ఆశీర్వాదం లాంటిదని బుధవారం డిక్లేర్ చేశారు. ప్రయోగాత్మక ట్రీట్‌మెంట్లు అందరు అమెరికన్లను ఫ్రీ చేస్తున్నాయని అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవుతూ వీడియో మెసేజ్‌లో తెలిపాడు.

రీ ఎలక్షన్ ప్రచారంలో.. రిపీటెడ్ గా స్ట్రెస్ చేస్తూ.. కొవిడ్-19 నుంచి రికవరీ అయి కరోనావైరస్ ను ఎదుర్కొన్న తీరును చెప్పుకొస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఆయన పాజిటివ్ గా ఉన్నారా లేదా అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.



‘నాకు తెలిసి ఇది దేవుడి నుంచి ఆశీర్వాదం అనుకుంటున్నా’ అని ట్రంప్ అన్నారు. రెజెనెరన్ ఫార్మాసూటికల్స్ ఇన్క్ నుంచి వచ్చిన మెడికేషన్ ను ఫాలో అయ్యారు.

ట్రంప్ కు మాత్రం విమర్శలు తప్పడం లేదు.. 2లక్షల 10వేల మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడం, మాస్క్ లేకుండా తన సొంత స్టాఫ్ ముందు తిరుగుతూ రిస్క్ కు గురి చేశాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రంప్ మాత్రం అవేం పట్టించుకోకుండా.. ‘వైరస్ నుంచి బయటపడటానికి ఏం వాడానో అవన్నీ మీకూ అందేలా చేస్తాను. అది కూడా ఉచితంగానే’ అంటూ మాటిచ్చేస్తున్నాడు ట్రంప్. నాలుగు రోజుల నుంచి అతనికి జ్వరంగా లేదు. లక్షణాలు కూడా 24గంటలుగా కనిపించడం లేదు. సప్లిమెంటల్ ఆక్సిజన్ అవసరం లేదు. ఇవ్వడం లేదు అని వైట్ హౌజ్ డాక్టర్ కాన్లీ చెప్పారు.