China Accident: చైనాలో ఘోర ప్రమాదం.. ఐదు వాహనాలు ఢీ.. 16 మంది మృతి
క్షుచాంగ్-గ్వాంజో రహదారిపై ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పది నిమిషాల వ్యవధిలోనే ఈ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో మంటలు చెలరేగాయి. కొన్ని వాహనాలు ధగ్ధమయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో 16 మంది ప్రయాణికులు మరణించారు.
- Narender Thiru
- Published on- February 5, 2023 / 09:18 PM IST
China Accident: చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ చైనా, హునాన్ ప్రావిన్స్ పరిధిలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. క్షుచాంగ్-గ్వాంజో రహదారిపై ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పది నిమిషాల వ్యవధిలోనే ఈ వాహనాలు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంతో మంటలు చెలరేగాయి. కొన్ని వాహనాలు ధగ్ధమయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో 16 మంది ప్రయాణికులు మరణించారు. మరో 66 మంది గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని స్థానిక రవాణా అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
చైనా ప్రభుత్వం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు స్థానికంగా వైరల్ అవుతున్నాయి.
