XI Jinping : బ్రిక్స్‌ సదస్సులో మోదీ విందుకు చైనా అధ్యక్షుడు ఎందుకు హాజరవ్వలేదు..? అసలు కారణం ఇదేనా.. షాకింగ్ న్యూస్

China President XI Jinping : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై  రెండు రోజులుగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

China President XI Jinping

China President XI Jinping : ఈనెల 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోపాటు పలు దేశాల అధ్యక్షులు పాల్గొన్నారు. షీ జిన్‌పింగ్ ప్రధాని మోదీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, మోదీ భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు మాత్రం ఆయన హాజరు కాలేదు.

Also Read : Onion Price Hike: కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిధర.. ఏడాదిలోనే 94 శాతం పెరుగుదల.. కిలో ఎంత ఉందో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ సహా పలువురు నేతలు విందులో పాల్గొనగా.. చైనా తరపున విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘమైన కార్యక్రమాల తరువాత విశ్రాంతి తీసుకోవడానికి జిన్‌పింగ్ హోటల్ కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే, విందుకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారనే దానిపై అధికారిక వివరణ రాలేదు.. ఈ అంశంపై ప్రస్తుతం ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై  రెండు రోజులుగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, చైనా డెమోక్రసీ పార్టీ చైర్మన్ వాంజున్ షీ సోషల్ మీడియా వేదికగా షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై పలు పోస్టులు పెట్టారు.

బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పృహ కోల్పోయారని, వైద్య బృందం అత్యవసర చికిత్స అందించిందని, ఆ తరువాత ప్రత్యేక విమానంలో బీజింగ్‌కు తరలించారని ఆరోపించారు. అంతేకాదు.. బీజింగ్‌కు చేరుకున్న వెంటనే ఆయన్ను సైనిక హెలికాప్టర్‌లో 301 ఆసుపత్రికి తరలించినట్లు, ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో పర్యవేక్షిస్తున్నారని తన పోస్టులో వాంజున్ షీ ఆరోపించారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై పలు వార్తలు వస్తున్న సమయంలో.. బ్రిక్స్ సదస్సులో మోదీ విందుకు హాజరుకాకపోవటంపైనా పలు కథనాలు వస్తున్నాయి. బ్రిక్స్ సదస్సులో షీ జిన్‌పింగ్ అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారని, ఆ తరువాత తీవ్ర ఇస్కీమిక్ స్ట్రోక్ (మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వల్ల వచ్చే పక్షవాతం) భారిన పడ్డారని, ఆ వెంటనే ఆయన్ను ప్రత్యేక విమానంలో బీజింగ్ కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో బ్రిక్స్‌ సదస్సులో మోదీ ప్రసంగం సందర్భంగా జరిగిన ఓ చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో కూడా చర్చకు వచ్చింది. మోదీ.. చైనా ప్రతినిధి బృందం వైపు తిరిగి ఇట్స్‌ ఓకేనా? అని అడగడం, జిన్‌పింగ్‌ స్పందించినట్లు కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది.