Rare Minimoon : ఇది చందమామ తమ్ముడు.. చిన్నమామ.. కనిపెట్టిన చైనా.. ఎక్కడుందంటే..

Rare Minimoon, Earth Minimoon, China Spacecraft, Earth asteroids, Kamo oalewa, అరుదైన చందమామ, కమో ఓలేమా చందమామ, రహస్య గ్రహశకలం, క్వాసీ శాటిలైట్

Rare Minimoon

Rare Minimoon : చందమామ ఒక్కటేనా.. కాదు.. మరో చందమామ కూడా ఉందంటే నమ్ముతారా? అవును ఇది నిజం.. చందమామకు నిజంగా ఒక్క తమ్ముడు కూడా ఉన్నాడు.. అదే చిన్నమామ.. చైనా ఈ చంద్రున్ని బుల్లిమామ అని ముద్దుగా పిలుచుకుంటోంది. చైనా ప్రయోగించిన అంతరిక్ష పరిశోధనలో చంద్రుడిని పోలిన ఓ రహస్య గ్రహశకలం బయటపడింది.

అదో అరుదైన అంతరిక్ష అతిథి.. దీనికి కమో ఓలేవా అనే పేరు కూడా పెట్టారు చైనా సైంటిస్టులు. ఇన్నాళ్లూ టెలిస్కోపుల్లో ఏదో చిన్న (Rare Minimoon) చుక్క మాదిరిగా మాత్రమే కనిపించిన ఈ బుల్లిమామను ఫస్ట్ టైం అత్యంత సమీపం నుంచి ఫొటో తీసి ప్రపంచానికి చూపించింది చైనా టియాన్వెన్-2 అంతరిక్ష నౌక.

2025 మే 29న టియాన్వెన్-2 ప్రయాణం మొదలైంది. దాదాపు 13 నెలల పాటు అంతరిక్షంలో సుమారు ఒక బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించింది. జూలై 2న కమో’ఓలేవా మినీమూన్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించిన ఈ అంతరిక్ష నౌక ఫస్ట్ క్లోజ్ అప్ షాట్ తీసింది.

ఆ ఫొటోలో చిన్నమావా గుండ్రంగా కాదు.. గరుకైన ఉపరితలంతో సన్నని ఆకారంలో చిన్న గ్రహశకలంగా కనిపించింది. ఈ మినీమూన్ వెడల్పు కేవలం 40 మీటర్ల నుంచి 100 మీటర్లు మాత్రమేగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు చంద్రుని మాదిరిగానే ఈ బుల్లిమామ కూడా భూమి చుట్టూ తిరిగే అత్యంత అరుదైన వస్తువుల్లో ఒకటిగా కనువిందు చేస్తోంది.

Read Also : Siya Goyal : ప్రేమ కోసం పక్కా స్కెచ్.. సోనమ్ రఘువంశీ మిస్టేక్స్ స్టడీ చేసిన సియా.. చివరికి పోలీసులకే షాక్!

భూమికి రెండో చంద్రుడా? :
భూమికి ఇప్పటివరకూ ఒకటే చంద్రుడు ఉన్నాడు. ఈ రహస్య గ్రహశకలం రెండో చంద్రుడా అంటే కాదనే చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. క్వాసీ-శాటిలైట్ అనే స్పెసల్ టైప్ గ్రహశకలం. వాస్తవానికి, ఈ గ్రహశకలం భూమి చుట్టూ తిరగదు.

సూర్యుడి చుట్టూ తిరుగుతూ భూమితో గురుత్వాకర్షణ సంబంధం ఉంటుంది. అందుకే మనకు ఇది భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఇలాంటి క్వాసీ-శాటిలైట్లు మినీమూన్ గ్రహాలను ఇప్పటివరకు కేవలం 7 మాత్రమే గుర్తించారు. అందుకే కమో’ఓలేవా సైంటిస్టులకు అత్యంత విలువైన పరిశోధనా అంశంగా మారింది.

ఈ మినీమూన్ ఫొటోలు తీయడమే కాదు.. దానిపై దిగేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించి అక్కడి రాతి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడమే టియాన్వెన్-2 మిషన్ లక్ష్యం. ఆ నమూనాలతో సైంటిస్టులు లోతుగా పరిశోధన చేయనున్నారు.

తద్వారా కమో’ఓలేవా అసలు చంద్రుడి నుంచే కోట్ల ఏళ్ల క్రితం జరిగిన భారీ విస్ఫోటనం వల్ల విడిపోయిన శకలమా? లేక వేరే గ్రహశకలమా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికనుంది. ఒకవేళ ఈ మిషన్ విజయవంతమైతే భూమికి అత్యంత దగ్గరలో ఉన్న చిన్నమామ రహస్యాలను ప్రపంచం తొలిసారి పూర్తిగా తెలుసుకోవచ్చు.