×
Ad

Tik Tok star Died : లైవ్ స్ట్రీమ్ వీడియో షూట్‌ చేస్తూ టిక్‌టాక్ స్టార్ మృతి

లైవ్ వీడియో చేస్తూ మరో tiktok star ప్రాణాలు కోల్పోయింది. 160 ఎత్తునుంచి కింద పడి చనిపోయింది టిక్ టాక్ స్టార్.

  • Published On : July 27, 2021 / 05:52 PM IST

Chinese Tiktok Star Xiao Qiumei Dead

Tik Tok star Died : Tik Tok. ఎంతపాపులరో అంత వివాదాస్పదమైంది. Tik Tok వీడియోలు విభిన్నంగా చేయాలని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రకరకాల ఫీట్లు చేస్తూ..ప్రాణాలు కోల్పోయిన ఘటనలు విషాదాలను కలిగించాయి. ఇటువంటిదే జరిగింది మరో టిక్ టాక్ స్టార్ విషయంలో. లైవ్ స్ట్రీమ్ వీడియోను షూట్‌ చేస్తూండగా దుర్మరణం పాలైంది చైనీస్ టిక్‌టాక్ స్టార్ జియావో క్యుమీ. 23 ఏళ్ల జియావో 160 అడుగుల ఎత్తులో టిక్‌టాక్‌ వీడియో రికార్డ్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆమె అభిమానులను షాక్ కు గురిచేసింది.

క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసే జియావో తాను పనిచేసే క్రేన్ నుండే పలు వీడియోలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు రకాలుగా..డిఫరెంట్ యాంగిల్స్ లో వీడియోలు చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ స్టార్‌గా పాపులర్‌ అయింది. ఈ క్రమంలోనే మరో డిఫరెంట్ వీడియో చేయాలని అనుకుంది. ఆ వీడియోతో అభిమానులకు ఖుషీ చేయాలని తపనపడింది. అలా తోటి ఉద్యోగులంతా డ్యూటీ కంప్లీట్ చేసి వెళ్లి పోయిన తరువాత 160 ఎత్తులో క్రేన్ క్యాబిన్లో కూర్చుని వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది జియావో. కానీ జరగరానిది జరిగిపోయింది.వీడియో తీసే క్రమంలో అదుపు తప్పింది. కింద పడిపోయింది. ఫోన్‌ చేతిలో పట్టుకుని కింద పడిపోతున్న దృశ్యాలు వీడియోలో రికార్డు కావటం గమనించాల్సిన విషయం. దీంతో టిక్ టాక్ స్టార్ ఆఖరి వీడియో..అది కూడా లైవ్ స్ట్రీమ్ వీడియో వైరల్‌ అయింది. తమ అభిమాన స్టార్ చనిపోయినందుకు ఆమె అభిమానులంతా షాక్ కు గురయ్యారు.

టిక్‌టాక్ చైనీస్ వెర్షన్‌ డౌయిన్ ప్లాట్‌ఫాంలో లక్షమంది మందికి పైగా ఫాలోవర్లో జియావో క్యుమీ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఈమె డ్యాన్స్ వీడియోలు ఆమెకు ఎంతో క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈక్రమంలో అభిమానులకు అలరించటానికి మరో వీడియో చేయబోతుండగా అదుపు తప్పి 160 అడుగుల ఎత్తునుంచి పడి ప్రాణాలు కోల్పోయి..తన కుటుంబానికి తీరని లోటుతో పాటు జియావో ఆకస్మిక మరణం అభిమానులను తీవ్ర విషాదంలో పడేసింది.