ప్రధాని మోడీ, సీఏఏపై విమర్శలు : ట్విట్టర్ లో ట్రెండింగ్‌గా మారిన కమెడియన్ జాన్ ఒలివర్ వీడియో

ప్రముఖ బ్రిటీష్ కమెడియన్ జాన్ ఒలివర్(john oliver) ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచారు. సెటైరికల్ కరెంట్ అఫైర్స్ పై జాన్ ఒలివర్ ప్రొగామ్స్ చేస్తుంటారు. ఈసారి భారత దేశంలో తీవ్ర

  • Publish Date - February 24, 2020 / 07:43 PM IST

ప్రముఖ బ్రిటీష్ కమెడియన్ జాన్ ఒలివర్(john oliver) ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచారు. సెటైరికల్ కరెంట్ అఫైర్స్ పై జాన్ ఒలివర్ ప్రొగామ్స్ చేస్తుంటారు. ఈసారి భారత దేశంలో తీవ్ర

ప్రముఖ బ్రిటీష్ కమెడియన్ జాన్ ఒలివర్(john oliver) ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచారు. సెటైరికల్ కరెంట్ అఫైర్స్ పై జాన్ ఒలివర్ ప్రొగామ్స్ చేస్తుంటారు. ఈసారి భారత దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జాన్ ఒలివర్ స్పందించారు. సీఏఏ, ప్రధాని మోడీని తప్పుపడుతూ తన అభిప్రాయం చెప్పారు. ఈ ఎపిసోడ్ నిడివి  18 నిమిషాలు ఉంది. సీఏఏ గురించి ఒలివర్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. 

లాస్ట్ వీక్ టునైట్(last week tonight) పేరుతో సెటైరికల్ కరెంట్ అఫైర్స్ షోని జాన్ ఒలివర్ నడుపుతున్నారు. ఈ ఎపిసోడ్ హెచ్బీవో(HBO) లో ప్రసారం అవుతుంది. ఈసారి ఆయన సీఏఏ టాపిక్ ని టచ్ చేశారు. దీని గురించి 18 నిమిషాల పాటు వివరించారు. గత రెండు నెలలుగా సీఏఏ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ అంశంపై జాన్ ఒలివర్ స్పందించారు. దీని గురించి మాట్లాడిన జాన్ ఒలివర్.. మోడీ ఆయన పార్టీ… లక్షలాది ముస్లింలకు భారత పౌరసత్వం నిరాకరించే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఎపిసోడ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. వేలాది మంది ట్వీట్ చేస్తున్నారు. ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. దయచేసి ఈ వీడియో చూడండి.. అని కోరుతున్నారు.

జాన్ ఒలివర్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. హాట్ హాట్ గా ట్వీట్స్ చేస్తున్నారు.