Commonwealth Games 2022 : పసిడి పట్టు.. కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ల జోరు.. ఒకేరోజు 3 స్వర్ణాలు
ఇంగ్లండ్ బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెజ్లర్లు అదరగొట్టారు. ఒక్కరోజే మూడు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు.
- Naveen
- Updated on- August 6, 2022 / 12:16 AM IST
Commonwealth Games 2022 : ఇంగ్లండ్ బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెజ్లర్లు అదరగొట్టారు. ఒక్కరోజే మూడు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు. భారత స్టార్ రెజ్లర్లు భజరంగ్ పునియా, సాక్షి మాలిక్, దీపక్ పునియాలు స్వర్ణం సాధించారు.
తొలుత భజరంగ్ పునియా, తర్వాత సాక్షి మాలిక్ ఆ తర్వాత దీపక్ పునియా పసిడి పట్టు పట్టారు. ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 86కేజీల విభాగంలో పాకిస్తాన్ ఆటగాడు ఇనామ్ పై ఫైనల్లో 3-0 తేడాతో గెలుపొంది స్వర్ణం సాధించాడు దీపక్ పునియా. ఈ గెలుపుతో కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ స్వర్ణాల సంఖ్య 9కి చేరగా.. మొత్తం పతకాలు 25కి చేరాయి.
భజరంగ్ పునియాపై ప్రధాని ప్రశంసలు:
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ కామన్వెల్త్ పోటీల్లో స్వర్ణం సాధించింది. 62 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కెనడాకు చెందిన అనా గొడినెజ్‌పై సాక్షి మాలిక్ విజయం సాధించింది.
సాక్షి మాలిక్ పై ప్రధాని ప్రశంసలు:
పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో తలపడిన భజరంగ్ పూనియా.. కెనడాకు చెందిన లాచలాన్ మెక్‌నీల్‌ను 2-9 పాయింట్ల తేడాతో ఓడించి బంగారు పతకం సాధించాడు. 2014 కామన్‌వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్న ఈ 28 ఏళ్ల స్టార్ రెజ్లర్.. 2018లో వేల్స్‌కు చెందిన కేన్ చారిగ్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు. ఈసారి మళ్లీ తన మ్యాజిక్ రిపీట్ చేసి స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు.
దీపక్ పునియాపై ప్రధాని ప్రశంసలు:
మరోవైపు భజరంగ్ పూనియా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కామెన్ వెల్త్ గేమ్స్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన అతడు.. మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు. ఇక మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అన్షుమాలిక్ రజతంతో సరిపెట్టుకుంది.
