వాహ్.. క్రికెట్ స్టేడియాన్ని కరోనా టెస్టింగ్ సెంటర్‌గా మార్చారు

కార్ పార్కింగ్ ఏరియాల్లోకి మారిన కరోనా టెస్టింగ్ సెంటర్లు కాస్తా.. క్రికెట్ స్టేడియాన్నే వాడేసుకుంటున్నాయి. కరోనా బాధితులకు కేవలం ఆస్పత్రిల్లోనే చికిత్స చేయడం సాధ్యపడదు కాబట్టి, రైళ్లు, స్పోర్ట్స్‌ అకాడమీలు ఇలా ప్రతీ దాన్ని వినియోగించుకునే పనిలో ఉన్నాయి ప్రపంచ దేశాలు. ఇంగ్లాండ్‌లో ఏకంగా ఒక క్రికెట్‌ స్టేడియాన్నే సిద్ధం చేశారు. ప్రముఖ ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియాన్నికోవిడ్‌-19 టెస్టింగ్‌ సెంటర్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

నేషనల్‌  హెల్త్‌ సర్వీసుల్లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియాన్ని కరోనా వైరస్‌ టెస్టింగ్‌ సెంటర్‌గా మార్చడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వార్విక్‌షైర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నీల్‌ స్నో బాల్‌ తెలిపారు. కరోనా మెయిన్ టెస్టులో భాగంగా ముందు ముక్కు, గొంతు పరీక్ష చేస్తారు. వైరస్ లక్షణాలు ఉంటే తర్వాత టెస్టులకు ల్యాబ్ లకు పంపిస్తారు. ఏప్రిల్ చివరి నాటికి లక్ష మందికి టెస్టులు చేయాలనేదే వారి టార్గెట్. (తెలంగాణలో 229కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు)

‘ఇంగ్లాండ్‌లో క్రికెట్‌ సంబంధిత కార్యక్రమాలు, సమావేశాలు, ఈవెంట్స్‌, వ్యాపార కార్యకలాపాలన్నీ మే 29వరకూ నిలిపేశాం. ఇటువంటి కీలక సమయంలో మేమంతా ప్రజలకు అందుబాటులో ఉండటంపైనే దృష్టి సారించాం. మా మాజీ ఆటగాళ్ల సాయం కూడా తీసుకుంటున్నాం. ఎడ్జ్‌బాస్టన్‌ను కరోనా వైరస్‌ సెంటర్‌గా మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇందుకు అనుమతి లభించిన వెంటనే కరోనా టెస్టింగ్‌ సెంటర్‌ అందుబాటులోకి తీసుకొస్తాం’ అని  నీల్‌ స్నో బాల్‌ వివరించారు. (Lockdown ప్రాంతాలకు విమానంలో పిజ్జా, బీరు డెలివరీ)