Coronavirus quarantine: ప్రపంచవ్యాప్తంగా Porn సర్వీసులు ఫ్రీ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కబలిస్తుంటే నియంత్రించే పనిలో భాగంగా ప్రభుత్వాలు కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ బాధ్యతారహితంగా రోడ్లపైకి వచ్చేవారిని ఏదో ఒక విధంగా భయపెట్టి బయటకు రానీయకుండా చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే పోర్న్ సైట్లు ప్రపంచవ్యాప్తంగా ఆఫర్ పట్టుకొచ్చాయి. ఇళ్లలో నుంచి కదలకుండా ఉండాలనే ఉద్దేశ్యంత మంగళవారం తమ ప్రీమియం సర్వీసులను ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాయి. 

ఇప్పటికే ఓటీటీల్లో చూసే ఉంటాం. యూట్యూబ్ కూడా ప్రీమియమ్ సర్వీసు తీసుకొచ్చింది. మామూలుగా బ్రాడ్ కాస్ట్ చేసే ఛానెళ్లు ప్రీమియం సర్వీసులో యాడ్స్ లేకుండా.. ప్రత్యేకమైన కంటెంట్ తో సిద్ధమవుతాయి. ఇదే తరహాలో ప్రీమియం సర్వీసును ఫ్రీగా ఇస్తామంటూ పోర్న్ హబ్ సైట్ ముందుకొచ్చింది. ఈ ప్రీమియం సౌకర్యంతో థర్డ్ పార్టీ సైట్లు, హ్యాకర్లు,  ఫిష్షింగ్ సైట్లు అడ్డురాకుండా క్వాలిటీతో కూడిన టెలికాస్ట్ అవుతాయి. 

ఈ సందర్భంగా పోర్న్ హబ్ ఎరియా ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది.  ‘ఇంట్లో ఉండండి. కరోనా మనందరిపై ప్రభావం చూపిస్తుంది. ఏప్రిల్ 23 వరకూ ఉచితంగా పోర్న్ హబ్ ప్రీమియం సర్వీసులు ప్రపంచ వ్యాప్తంగా అందిస్తున్నాం. ఇంట్లోనే ఉండి సేఫ్‌గా ఎంజాయ్ చేయండి’ అంటూ ట్వీట్ చేసింది. 

ఇటలీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నెలరోజుల పాటు ఫ్రీ సర్వీసు అందించింది. ఆ తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్ లలోనూ ఇదే ఛాన్స్ ఇచ్చింది. పోర్న్ వీడియోలు చేసి పోస్ట్ చేసే మోడల్స్ కు పూర్తి అమౌంట్ ను ముందుగానే చెల్లించి వీడియోలు కొనుగోలు చేసుకుంటుంది పోర్న్ హబ్. ఏప్రిల్ నెలలో పోస్టు చేసే వీడియోలన్నింటికీ డబ్బులు ఇస్తామని చెప్పేసింది. 

ప్రపంచ వ్యాప్తంగా 4లక్షల 23వేల 660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 18వేల 923మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో 582కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 11మంది ప్రాణాలు కోల్పోయారు. 41మంది రికవరీ కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. 

Also Read | హోం ఐసోలేషన్ బోర్ కొడుతుందా? Netflix Party ఫీచర్ ద్వారా మీ స్నేహితులతో స్ట్రీమ్ మూవీలను చూడొచ్చు!