127 దేశాలకు పాకిన కరోనా…4,973 మంది మృతి 

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4 వేల 973కి చేరింది.

  • Publish Date - March 13, 2020 / 02:50 AM IST

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4 వేల 973కి చేరింది.

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4 వేల 972కి చేరింది. 1 లక్షా, 34 వేల 558 మంది కరోనా బాధితులు ఉన్నారు. 5 వేల 994 మందికి సీరియస్ గా ఉంది. ఇరాన్ లో ఒక్కరోజే కరోనాతో 75 మంది మృతి చెందారు. 

భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్ లోని అని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మార్చి 31వ తేదీ వరకు మూసేయాలని గురువారం(మార్చి 12,2020) ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ప్రైమరీ స్కూల్స్ కు ప్రభుత్వం సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ ను నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న స్కూళ్లు, కాలేజీలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆ విద్యా సంస్థలు తెరిచే ఉంటాయి. పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలు మాత్రం తప్పనిసరిగా మూసేయాలని సీఎం కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. అంతేకాదు అన్ని రకాల బహిరంగ సభలను రద్దు చేసుకోవాలన్నారు.

భారత్‌లో తొలి కరోనా మృతి నమోదైంది. కర్ణాటక వాసి హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి.. చనిపోయినట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇదే భారత్‌లో నమోదైన తొలి కరోనా మృతి కావడం విచారకరం. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన వ్యక్తి మరణంతోపాటు భారత్‌లో ఇప్పటివరకూ 74 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు భయపడొద్దని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. 
 

See More:

ఉద్యోగికి కరోనా: నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ మూసివేత

కరోనా ఎఫెక్ట్ : విదేశాల నుంచి వచ్చిన వారు ఇంటివద్దే ఉండండి​​​​​​​

ప్రధాని భార్యకు కరోనా వచ్చిందని Work from Home​​​​​​​