Covid-19 Restrictions : అమెరికా, కెనడా సరిహద్దులో ఆంక్షలు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

కొవిడ్ వ్యాప్తితో అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఆంక్షలను మళ్లీ పొడిగించింది కెనడా ప్రభుత్వం. జూలై 21 వరకు అమెరికా-కెనడాల మధ్య ఆంక్షలు కొనసాగతాయని పేర్కొంది. ఈ విషయంలో అమెరికా కూడా ఓకే చెప్పేసింది.

Covid 19 Us Canada Border Restrictions Extended Until July 21

Covid-19: US-Canada border restrictions : కొవిడ్ వ్యాప్తితో అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఆంక్షలను మళ్లీ పొడిగించింది కెనడా ప్రభుత్వం. జూలై 21 వరకు అమెరికా-కెనడాల మధ్య ఆంక్షలు కొనసాగతాయని పేర్కొంది. ఈ విషయంలో అమెరికా కూడా ఓకే చెప్పేసింది. రెండింటి మధ్య సరిహద్దు ద్వారా కొనసాగే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయని కెనడా మంత్రి ఒకరు వెల్లడించారు. కెనడియన్లలో అధికా శాతం మంది టీకాలు వేస్తోంది.. ఈ సమయంలో అమెరికా వెళ్లేందుకు సరిహద్దుల్లో పరిమితులను మరింత పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికా సమన్వయంతోనే ఈ ఆంక్షలను పొడిగించినట్టు ప్రజా భద్రతా మంత్రి బిల్ బ్లెయిర్ చెప్పారు.

ప్రస్తుతానికి కెనడాలో 20 కంటే తక్కువ మందికే టీకాలు వేస్తున్నట్టు తెలిపారు. దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోందని, కంట్రోల్ చేయాలంటే ఆంక్షలు పొడిగించాల్సిన అవసరం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. కరోనా టీకాలను మొదటి మోతాదులో 75 శాతం వేయాలని భావిస్తోంది. అలాగే రెండో మోతాదును కనీసం 20 శాతం మందికి టీకాలు వేయనున్నారు. పూర్తిగా టీకాలు తీసుకున్న ప్రయాణికులు తిరిగి వచ్చే కమ్యూనిటీలు వైరస్ బారిన పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ట్రూడో చెప్పారు.

కెనడా, అమెరికా మధ్య సరిహద్దులో మహమ్మారి ప్రారంభ నెలల్లో 2020 మార్చిలో ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుండి ప్రతి నెలా పొడిగిస్తూ వస్తున్నాయి. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని ప్రధాని ట్రూడో తెలిపారు. కొవిడ్ టీకా తీసుకున్న ప్రయాణికులకు కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇప్పటికే కెనడాలోని కొన్ని ప్రావిన్సులు మూసివేశారు. అంటారియో, క్యూబెక్ రెండు ప్రావిన్సుల మధ్య ప్రయాణాలకు అనుమతి లేదు. అట్లాంటిక్ కెనడా కెనడాలోని ఇతర ప్రాంతాల నుంచి కెనడియన్లకు జూలై వరకు మూసివేయనున్నారు. అర్హత కలిగిన కెనడియన్లలో 80 శాతం మందికి జూలై చివరి నాటికి పూర్తిగా టీకాలు వేయడానికి తగినంత వ్యాక్సిన్ ఇవ్వాలని కెనడా ప్రభుత్వం ఆశిస్తోంది.

అర్హత కలిగిన కెనడియన్లలో 70 శాతం మందికి కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. రెండవ మోతాదు ఈ నెల లేదా ఆ తర్వాత పెంచే అవకాశం ఉంది. మొదటి మోతాదుతో ఎక్కువ మందిలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు కెనడా రెండవ మోతాదు ఇవ్వడం ఆలస్యంగా ఇస్తోంది. అమెరికా ఎగుమతులను అనుమతించకపోవడంతో కెనడా మే నెలలో అమెరికా తయారుచేసిన వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంది.

మే నెలలో ఫైజర్ మిచిగాన్ ప్లాంట్ నుంచి ఫైజర్ టీకా మోతాదు రావడం ప్రారంభమయ్యే వరకు కెనడా ఎక్కువగా యూరప్ నుంచే వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంది. దేశానికి తిరిగి వచ్చే కెనడియన్లకు పూర్తిగా టీకాలు వేసినట్టుగా వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కెనడియన్ పౌరులకు జూలై ప్రారంభంలో దేశానికి తిరిగి వచ్చేటప్పుడు కొవిడ్ నెగటివ్ రిపోర్టు ఉంటే.. రెండు వారాల క్వారంటైన్ నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది.