కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో తయారుచేసిన (Covid-19) వ్యాక్సిన్‌ను ఫేజ్ 3ట్రయల్స్ లోనూ 90శాతం ఎఫెక్టివ్ గా పనిచేసింది. దీనిని యూఎస్ ఫార్మాసూటికల్ దిగ్గజం Pfizer and German biotech firm BioNTech డెవలప్ చేసింది. ఈ మేరకు ఆ కంపెనీ సోమవారం చేసిన ప్రకటనలో వెల్లడించింది.
‘కొవిడ్ వ్యాక్సిన్ కోసం చేసిన ఫేజ్ 3ట్రయల్స్ ఫస్ట్ సెట్ లో వచ్చిన ఫలితాలు కొవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడగలమనే నమ్మకాన్ని ఇస్తున్నాయి’ అని ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా అన్నారు. ‘వ్యాక్సిన్ కనుగొనడానికి చాలా దగ్గరగా వచ్చాం. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభంలో పడేసిన మహమ్మారి నుంచి గట్టెక్కబోతున్నాం’ అని బౌర్లా చెప్పారు.
రెండు డోసులు ఇచ్చిన తర్వాత పేషెంట్లలో ప్రొటెక్షన్ మెరుగైంది. మొదటి డోస్ ఇచ్చిన 28రోజుల తర్వాత ఈ టెస్టు చేశాం. జబ్బుకు గురైన 94మందిపై ఈ విశ్లేషణ జరిపాం. 164కేసులను టెస్టు చేసేవరకూ ట్రయల్ కొనసాగుతూనే ఉంటుంది. ప్రిలిమినరీ టెస్టు ఫలితాలు సానుకూలంగా రావడంతో మరింత ముందుకు వెళ్లేందుకు నమ్మకం వచ్చింది.
సంవత్సరం చివరినాటికి 50 మిలియన్ డోసులు సరఫరా చేయాలని చూస్తున్నాం. 2021నాటికల్లా 1.3బిలియన్ డోస్లు రెడీ చేయగలమని కంపెనీ చెప్తుంది.