ముక్కులో స్ప్రే కొడితే కరోనా మటుమాయం

కరోనా వైరస్‌కు DNA ఆధారిత వ్యాక్సిన్ రెడీ అవుతోంది. డ్రగ్ తయారుచేయడానికి కొత్త పద్ధతి వాడుతున్నారు. కేవలం ముక్కులో స్ప్రే కొట్టి కొవిడ్-19ను తగ్గించే విధంగా దీనిని సిద్ధం చేస్తున్నారు. కెనడాకు చెందిన వాటర్లూ యూనివర్సిటీ రీసెర్చెర్స్ ఈ ప్రయోగానికి తెరలేపారు. DNA ఆధారిత వ్యాక్సిన్ శరీరంలో అప్పటికే ఉన్న బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఈ పద్ధతిని బ్యాక్టీరియోఫేజ్ అంటారు. 

కొవిడ్-19కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ పెంచడానికి వ్యాక్సిన్ వాడతారు. వ్యాక్సిన్ లో చిన్న డోస్ కూడా వైరస్ కారకాలను చంపేస్తుంది. శరీరంలోకి చొరబెట్టిన బ్యాక్టీరియా యాంటీబాడీలను ఉత్పత్తి చేసి.. పోరాడేందుకు సిద్ధం చేస్తుంది. అదే రీతిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 

వైరస్ లను చంపే VLP(వైరస్ లాంటి పదార్థాలు) ఒకసారి రెడీ అయితే SARS-CoV-2 లాంటి నిర్మాణాలపైన పనిచేయొచ్చు. తర్వాత కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకంగా శరీరాన్ని సిద్ధం చేయగలం. ఒకవేళ ఇది VLPని ఎదుర్కోలేకపోతే SARS-CoV-2ను కూడా ఎదిరించలేదు. సక్సెస్ అయితే మాత్రం VLPని వ్యాక్సిన్ లా వాడుకోవచ్చు. 

ఈ వ్యాక్సిన్ కోసం 3 టీంలు పనిచేస్తున్నాయి. ఒకటి బ్యాక్టీరియోఫేజ్ డిజైన్ కోసం పనిచేస్తుంటే మరొకటి నానో మెడికేషన్ ను డెవలప్ చేసే పనిలో పడింది. మూడోది VLPప్యూరిఫై చేసి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే టెక్నిక్ పనిలో పడింది. రీసెర్చ్ పూర్తి అయ్యాక మరోసారి టెస్టు చేసి ఫైనల్ చేస్తాం. ఒకసారి సక్సెస్ అయిందనిపిస్తే సంవత్సరం చివరికల్లా టెస్టులకు రెడీ అయినట్లే. 

ప్రపంచవ్యాప్తంగా COVID 19పై పోరాడేందుకు 70వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయి. వాటిలో మూడు మనుషులపై ప్రయోగం చేసే దశలో ఉన్నాయి.