ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు? కీలక ప్రకటన చేసిన దలైలామా ఆఫీస్
అమెరికా గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
- T Venkateshwarlu
- Published On : February 8, 2026 / 05:15 PM IST
Dalai Lama
- ఎప్‌స్టీన్‌కు దలైలామాతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం
- జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను దలైలామా ఎన్నడూ కలవలేదు
- దలైలామా తరఫున ఎవరూ ఎప్‌స్టీన్‌తో భేటీ కాలేదు
Dalai Lama: “ఎప్‌స్టీన్” ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ వాటిలో బౌద్ధమత గురువు దలైలామా పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై దలైలామా కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.
“ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించిన కొన్ని మీడియా రిపోర్టులు, సోషల్ మీడియా పోస్టులు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు దలైలామాతో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను దలైలామా ఎన్నడూ కలవలేదు. అలాగే, దలైలామా తరఫున ఎప్‌స్టీన్‌తో సమావేశంలో పాల్గొనడానికి, సంభాషించడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నాం” అని దలైలామా కార్యాలయం పేర్కొంది.
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు
కాగా, అమెరికా గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇందులో రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు, బిలియనీర్లు, ఇతర అనేకమంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో దలైలామా పేరు 169 సార్లు ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే దలైలామా కార్యాలయం అధికారికంగా దీనిపై స్పందించింది.
