Deer : జింకకు కరోనా..!
ఇటీవల జంతువుల్లో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. తాజాగా అమెరికాలో ఓ జింకకు కరోనా సోకింది.
- kunduru Vinod
- Published On : August 29, 2021 / 11:38 AM IST
Deer
Deer : ఇటీవల జంతువుల్లో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. తాజాగా అమెరికాలో ఓ జింకకు కరోనా సోకింది. అయితే ఆ జింకకు కరోనా ఎలా సోకిందన్నది ఇంకా తెలియరాలేదు. ఓహియో రాష్ట్రంలో ఓ అడవి తెల్ల తోక జింకకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అది కరోనా వైరస్ బారినపడిన విషయం వెల్లడైంది.
జంతువుల నుంచి మనుషులు-జంతువుల మధ్య కరోనా వ్యాప్తిపై ఓహియో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన వెటర్నరీ కాలేజి పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో భాగంగా జంతువులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఒక జింకకు కరోనా సోకిన విషయం వెల్లడైంది. ఇప్పటివరకు కుక్కలు, పిల్లులు, గొరిల్లాలు, చిరుతలు, సింహాలు కరోనా బారినపడగా, జింకకు కరోనా సోకడం ఇదే తొలిసారి.
జంతువుల్లో కరోనా లక్షణాలు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జింకల గుంపుకు మొత్తం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పరీక్షల కోసం వాటి నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నారు.
