White House Diwali: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. పాల్గొన్న అమెరికా ప్రెసిడెంట్ బిడెన్, కమలా హారిస్
దీపావళి వేడుకలను అమెరికాలోనూ నిర్వహించారు. వైట్ హౌస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు జోబిడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బిడెన్, అదేవిధంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్, భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ లు పాల్గొన్నారు.
- Harishth Thanniru
- Published On : October 25, 2022 / 08:16 AM IST
Diwali At White House
White House Diwali: దీపావళి వేడుకలను అమెరికాలోనూ నిర్వహించారు. వైట్ హౌస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు జోబిడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బిడెన్, అదేవిధంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్, భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిడెన్ దీపాలను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో సుమారు 200 మందికిపైగా భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు.
Diwali At White House
రిసెప్షన్‌లో సితార్ వాద్యకారుడు రిషబ్ శర్మ, డ్యాన్స్ ట్రూప్ ది సా డ్యాన్స్ కంపెనీ ప్రదర్శనలతో సహా కొన్ని ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చీర, లెహంగా, షేర్వాణి వంటి భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి మహిళలు నృత్యాలు వేశారు. అతిథులు నోరూరించే భారతీయ వంటకాలను ఆస్వాదించారు.
Diwali At White House
ఈ సందర్భంగా జోబిడెన్ మాట్లాడుతూ.. మీకు ఆతిథ్యం ఇవ్వడం మాకు గర్వకారణం. వైట్‌హౌస్‌లో ఈ స్థాయిలో దీపావళి రిసెప్షన్ నిర్వహించడం ఇదే తొలిసారి. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ఆసియా అమెరికన్లు మాకు ఉన్నారు. దీపావళి వేడుకను సంతోషకరమైన భాగంగా చేసినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని తెలిపారు.
Diwali At White House
