చేస్తుందా.. చేయిస్తుందా: జిమ్‌లో మొత్తం ఆ కుక్కే

ప్రతి రోజూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఫిట్‌నెస్ సాధించడం కోసం రోజూ జిమ్‌కు వెళ్తున్నారా.. అయితే ఓ సారి ఈ వీడియో చూడండి. ఈ ఆస్ట్రేలియన్ షెప్‌యార్డ్ ఎక్సర్‌సైజులు ఎలా చేయాలో క్లాసులు చెప్తుంది. ఈ వీడియో నెట్టింట్లో షేర్ అయి వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. 

జనవరి 10న టెస్లా అనే కుక్క స్కిల్స్ ను తొలిసారిగా పోస్టు చేశారు. ఆ తర్వాత ట్విట్టర్లో వేల కామెంట్లు రావడంతో మరిన్ని ఫీట్లను పోస్టు చేశారు. ఆస్సీస్ డూయింగ్ థింగ్స్ అనే అకౌంట్ లో కుక్క దొర్లుతూ ఎగురుతూ క్లాస్ చెప్తుండటం చూసే వాళ్లందరికీ నవ్వు తెప్పిస్తుంది. టెస్లా  లీడర్ షిప్ క్వాలిటీస్‌తో క్లాస్ ముగిసిన తర్వాత ట్రీట్ కూడా కొట్టేసింది. 

ఈ వీడియో ట్విట్టర్లో 42లక్షల వ్యూయర్స్ ను దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 92వేల మంది వీక్షించారు. టెస్లా పేరు మీదనే ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. దానికి 40వేల మంది ఫాలోవర్లు ఉన్నారంటేనే తెలుస్తోంది అది కూడా ఓ సెలబ్రిటీ అని.