Dog runs with human head
Dog runs with human head: ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ కుక్క మనిషి తలను నోటితో కర్చుకొని వీధిలో పరుగెడుతుంది. ఈ ఘటన మెక్సికోలోని జకాటెకాస్ లో చోటు చేసుకుంది. స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. పలు ప్రయత్నాల అనంతరం పోలీసులు కుక్క నోటినుంచి మనిషి తలను వదిలించగలిగారు.
Eluru Boat Capsize : ఏలూరులో విషాదం.. కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా, ఇద్దరు మృతి
ఈ వీడియోలో కుక్క మనిషి తలను నోటితో కర్చుకొని పరుగెడుతుంది. దీనిని పలువురు వెంబడించినప్పటికీ అది తలను వదల్లేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కుక్కను వెంబడించి చివరికి తలను స్వాధీనం చేసుకున్నారు. గత బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ తల ఎక్కడి నుంచి వచ్చేందో పోలీసులు ఆరా తీశారు.
https://twitter.com/IbarYahawadah/status/1587279696521318404?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1587279696521318404%7Ctwgr%5E858c1858b3425c990df9f7b252eb7c6866362801%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2F
మోంటే ఎస్కోబెడో పట్టణంలోని ఆటోమేటిక్ టెల్లర్ బూత్‌లో తల, ఇతర శరీర భాగాలను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. బాధితుడిని ఇంకా గుర్తించలేదు. మిగిలిన శరీర భాగాలు కూడా కనుగొనబడలేదు. నివేదికల ప్రకారం.. మృతుడి వయస్సును నిర్ధారించడానికి తలను ఫోరెన్సిక్ బృందానికి అప్పగించారు. అయితే పోలీసులు ఘటన స్థలంలో రెండు నోట్లను కూడా కనుగొన్నారు. మృతిచెందిన వ్యక్తి నేరప్రవృత్తి కలిగి ఉండిఉండొచ్చని, ఘర్షణ కారణంగానే గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని చంపి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.