Israel Lebanon Ceasefire: ఆగిన యుద్ధం.. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం..
శాశ్వత శాంతిని సాధించడానికి ఇజ్రాయెల్, లెబనాన్‌లతో కలిసి పనిచేయమని నేను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి రూబియోతో పాటు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ రేజిన్ కేన్‌లను ఆదేశించాను.
- Naveen
- Updated on- April 16, 2026 / 09:44 PM IST
Israel Lebanon Ceasefire: ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 10 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు సీజ్ ఫైర్ అమలు కానుందని ట్రప్ అనౌన్స్ చేశారు. శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాల నేతలు ఈ సీజ్ ఫైర్ కు అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. వాషింగ్టన్ లో ఇరు దేశాల నేతలు కలుసుకోవడం 34ఏళ్లలో ఇదే తొలిసారి అని ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాంతిని చేకూర్చేందుకు కృషి చేయాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
”లెబనాన్ దేశపు అత్యంత గౌరవనీయులైన అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులతో అద్భుతమైన సంభాషణలు జరిపాను. తమ దేశాల మధ్య శాంతిని సాధించడం కోసం, ఈ ఇద్దరు నాయకులు 10 రోజుల కాల్పుల విరమణను లాంఛనంగా ప్రారంభించడానికి అంగీకరించారు. మన గొప్ప విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమక్షంలో ఈ రెండు దేశాలు 34 సంవత్సరాలలో మొదటిసారిగా వాషింగ్టన్ డి.సి.లో సమావేశమయ్యాయి. శాశ్వత శాంతిని సాధించడానికి ఇజ్రాయెల్, లెబనాన్‌లతో కలిసి పనిచేయమని నేను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి రూబియోతో పాటు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ రేజిన్ కేన్‌లను ఆదేశించాను. ప్రపంచవ్యాప్తంగా 9 యుద్ధాలను పరిష్కరించడం నాకు దక్కిన గౌరవం. ఇది నా 10వది” అని గొప్పలు చెప్పుకున్నారు ట్రంప్.
“శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడానికి” డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ధన్యవాదాలు తెలిపారని అమెరికా వెల్లడించింది. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను ఎక్స్ లో పోస్ట్ చేసింది. “అధ్యక్షుడు ఔన్, లెబనాన్‌కు తన మద్దతును తెలియజేస్తూ, వీలైనంత త్వరగా కాల్పుల విరమణ కోసం లెబనాన్ చేసిన అభ్యర్థనను నెరవేర్చడానికి తాను కట్టుబడి ఉన్నానని ట్రంప్ నొక్కి చెప్పారు.”
Also Read: డీలిమిటేషన్ రచ్చ.. ఏపీ, తెలంగాలో ఎన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయో చెప్పిన అమిత్ షా..
