Donald Trump : ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లవి మొసలి కన్నీరు.. అందరినీ ఒక్కదెబ్బతో లేపాస్తం..

Donald Trump Comments On Khamenei Funeral : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Donald Trump Comments On Khamenei Funeral

Donald Trump Comments On Khamenei Funeral : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము అనుకుంటే ఖమేనీ అంత్యక్రియల సమయంలోనే అక్కడున్న నాయకులందరినీ ఒక్కదెబ్బతో చంపేవాళ్లమని, కానీ, తమతో చర్చలు జరపడానికి ఎవరూ ఉండరనే కారణంతో వారిని వదిలేశామని అన్నారు. అంతేకాదు.. ఇరాన్ లో మిగిలిన నాయకత్వాన్ని నిర్మూలించగలమన్న ట్రంప్.. అలా చేయాలని అనుకోవడం లేదని పేర్కొన్నాడు.

Also Read : Union Cabinet expansion : కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. ఉప ప్రధానిగా అమిత్ షా? టార్గెట్ ఫిక్స్..!

ఖమేనీ అంత్యక్రియల్లో ఇరానియన్లు కన్నీరు పెట్టుకోవడంపై ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ దేశ ప్రజలు ఖమేనీని ద్వేషిస్తున్నారని ఇంతకాలం నేను అనుకున్నాను. నేను అనుకున్నట్లే ప్రస్తుతం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఖమేనీ అంత్యక్రియల సమయంలో అక్కడి ప్రజలు మొసలి కన్నీరు కార్చి ఉంటారని ట్రంప్ పేర్కొన్నాడు.

అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న మృతి చెందిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇస్లామిక్ న్యాయశాస్త్రం ప్రకారం మరణించిన వ్యక్తిని వీలైనంత త్వరగా అంటే 24గంటల్లోపు ఖననం చేయాలి. కానీ, ఇరాన్, అమెరికా మధ్య వార్ నేపథ్యంలో అంత్యక్రియలను ఇరాన్ నాయకత్వం వాయిదా వేసింది. జులై4వ తేదీన ఖమేనీ అంత్యక్రియలను ప్రారంభించారు. ఇరాన్‌, ఇరాక్‌లోని ఐదు నగరాల్లో ఏడు రోజులు పాటు ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈనెల 9వ తేదీన ఇరాన్‌కు ఈశాన్యంలోని పవిత్ర నగరమైన మషద్ ప్రాంతంలోని ఆయన సంస్థలంలో ఖమేనీని ఖననం చేయడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.