ఢిల్లీలో ఉగ్రవాదుల ప్లాట్లకు బాధ్యుడు సులేమాని : ట్రంప్

  • Publish Date - January 4, 2020 / 07:47 AM IST

ఇరాక్‌లో అమెరికా నిర్వహించిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ జనరల్‌ మిలటరీ ఖాసిం సులేమానీ మృతిచెందిన సంగతి తెలిసిందే. అమెరికా చర్యతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా హతమార్చడాన్ని ఇరాన్ దేశం ప్రతికారేచ్ఛతో రగిలిపోతోంది. ఏ క్షణమైనా #WWIII యుద్ధానికి దారితీసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇండియాలోని న్యూఢిల్లీలో ఉగ్రవాదుల ప్లాట్లకు ఇరాన్ మిలటరీ నేత ఖాసీంనే బాధ్యుడని ట్రంప్ స్పష్టం చేశారు.

ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో తన మార్-ఎ-లార్గో రీసార్ట్ లో ఆయన మాట్లాడుతూ.. ‘అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోడానికి సులేమాని కారకుడని, ఉగ్రవాదుల వసతి కల్పనలో సహకరించాడు ’ అని అన్నారు. సులేమానిని చంపేయాలంటూ తానే ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. #Soleimani క్రూరమైన కార్యకలాపాలతో ఎంతమంది అమాయికులు ప్రాణాలు కోల్పోయారని, బాధితుల గౌరవార్థంగా వారిని స్మరించుకుంటున్నట్టుగా తెలిపారు. ఇండియాలో ఎక్కడెక్కడ ఉగ్రవాదుల ప్లాట్లు ఉన్నాయి అనేది ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు.

2012లో ఇండియాలో ఇజ్రాయిల్ రాయబారి భార్య కారుపై బాంబు దాడిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించి ఉండొచ్చు. ఫిబ్రవరి 13, 2012లో కారు బాంబు దాడి జరగ్గా, ఈ ప్రమాదంలో తాల్ యెహోసాయివా కొరెన్ సహా ఆమె డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ కారుబాంబు దాడిపై ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు. ఈ బాంబు దాడితో ఇరాన్ కు సంబంధం ఉందనే విషయం కూడా భారత్ ప్రకటించలేదు.

మిడిల్ ఈస్ట్‌‌లో గత 20ఏళ్లుగా #MostWantedTerrorist సోలేమాని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ట్రంప్ ఆరోపించారు. టెహ్రాన్‌లో కారు బాంబు దాడిలో ఇరాన్ న్యూ క్లియర్ సైంటిస్ట్ మోస్తాపా అహ్మదీ రోషన్ హతమార్చినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడికి పాల్పడినట్టు అప్పట్లో ఇజ్రాయెల్ కూడా ఆరోపించినట్టు వార్త కథనాలు వచ్చాయి.