Donald Trump: ఆ దేశ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది.. ఇరాన్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ పై డోనాల్డ్ ట్రంప్(Donald Trump) షాకింగ్ వ్యాఖ్యలు.
- V Santhosh Kumar
- Published On : March 3, 2026 / 07:40 PM IST
Donald Trump shocking comments on Iran
Donald Trump: ఇరాన్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈమేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా ఆయన మాట్లాడారు. ‘ఇరాన్ అధికారులు నాతో మాట్లాడాలని అనుకున్నారు. కానీ, నేను ఆలస్యమైందని చెప్పాను. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది’ అంటూ ఆయన కీలక కామెంట్స్ చేశాడు.
CM Revanth: కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.. సంక్షేమ పథకాలపై కీలక ఆదేశాలు
అయితే, గతంలో ఆయన ఇరాన్ తో మాట్లాడానికి(Donald Trump) సిద్ధం అని చెప్పాడు. కానీ, ఇప్పుడు దానికి విరుద్ధంగా కామెంట్స్ చేశాడు. దీంతో. తాజాగా ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఇక, ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా చేసిన దారుల్లో ఆదేశ సుప్రీమ్ లీడర్ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రతీకార ఆలోచనలో ఉన్న ఇరాన్ యుద్ధంలో దాడికి ప్రతిదాడులు చేస్తూ గట్టి సవాల్ విసురుతోంది.
