Donald Trump : అమెరికా సంచలన నిర్ణయం..165ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్..! ఇకనుంచి ట్రంప్ సంతకంతో కరెన్సీ.. అమెరికా చరిత్రలోనే తొలిసారి..
Donald Trump : అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరర్, ట్రెజరీ కార్యదర్శి సంతకం ఉండటం 1861 నుంచి సంప్రదాయంగా వస్తోంది. ట్రంప్ సర్కార్ 165ఏళ్ల సంప్రదాయానికి ముగింపు పలకనుంది.
- Harishth Thanniru
- Published On : March 27, 2026 / 01:06 PM IST
Donald Trump
- అమెరికా సంచలన నిర్ణయం
- 165 ఏళ్ల సంప్రదాయానికి ట్రంప్ ప్రభుత్వం ముగింపు
- కొత్త డిజైన్‌తో విడుదలయ్యే నోట్లపై ట్రంప్ సంతకం
Donald Trump : అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. 165ఏళ్ల సంప్రదాయాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నారు. అమెరికా కరెన్సీ నోట్లపై సంతకం చేయబోయే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఏడాది జులై 4న జరగనున్న అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది.
Also Read : Beer Price Hike : మందు బాబులకు బిగ్అలర్ట్.. బీర్లు తాగుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..
అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరర్, ట్రెజరీ కార్యదర్శి సంతకం ఉండటం 1861 నుంచి సంప్రదాయంగా వస్తోంది. ట్రంప్ సర్కార్ 165ఏళ్ల సంప్రదాయానికి ముగింపు పలకనుంది. ఇన్నాళ్లు అమెరికా కరెన్సీపై ట్రెజరర్, ట్రెజరీ సెక్రటరీ సంతకాలు మాత్రమే ఉండేవి. వారితోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కూడా ఉండనున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ ప్రకటించింది. అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వ్యక్తి సంతకంతో కరెన్సీ నోట్లను ముద్రించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ట్రెజరీ శాఖ ప్రకటన ప్రకారం.. కొత్త డిజైన్‌తో విడుదలయ్యే నోట్లపై ట్రంప్ సంతకం ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి కనిపించనుంది. ఈ మార్పు అమెరికా కరెన్సీకి ‘జాతీయ గుర్తింపు, నాయకత్వ ప్రతీక’గా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, కొత్త నోట్ల ముద్రణకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమైనట్లు, ట్రంప్ సంతకం ఉన్న తొలి 100 డాలర్ల నోట్లను జూన్‌లో విడుదల చేయడం జరుగుతుందని ట్రెజరీ శాఖ తెలిపింది.
ఈ ఏడాది జూలై 4న అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రంప్ చిత్రం ఉన్న 24 క్యారెట్ల బంగారు నాణేన్ని కూడా విడుదల చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు గత నెలలోనే ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ ఆమోదం తెలిపింది. మరోవైపు.. ఒక డాలర్ నాణెంపై ట్రంప్ చిత్రాన్ని ముంద్రించేందుకు కమిషన్ సమీక్షిస్తోంది. పదవిలో ఉన్న అధ్యక్షుడి లేదా జీవించి ఉన్న మాజీ అధ్యక్షుడి చిత్రాన్ని కరెన్సీపై ప్రదర్శించడం అమెరికా చట్టానికి విరుద్ధం. దీంతో ఆ ప్రణాళికలు చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తాయి.
