Venezuela Earthquakes : శిథిలాల నుంచి 8రోజుల తర్వాత సజీవంగా బయటకు.. భార్య గురించి అతను చెప్పిన తొలి మాట ఇదే.. వీడియో వైరల్
Venezuela Earthquakes : వెనెజువెలా భూకంప శిథిలాల నుంచి ఎనిమిది రోజుల తరువాత 43ఏళ్ల సెక్యూరిటీ గార్డును సహాయక సిబ్బంది ప్రాణాలతో బయటకు తీశారు. ఆ సమయంలో ఆ వ్యక్తి తన భార్య గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Harish Thanniru
- Published on- July 3, 2026 / 09:37 PM IST
Venezuela Earthquakes
Venezuela Earthquakes : వెనెజువెలాలో భూకంపం సృష్టించిన విలయంతో వేలాదిమంది మృత్యువాత పడగా.. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భూకంపం వచ్చిన నాటి నుంచి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, కొందరు ప్రాణాలతో బయటపడుతున్నాడు. ఇదేక్రమంలో ఎనిమిది రోజుల తరువాత 43ఏళ్ల సెక్యూరిటీ గార్డును శిథిలాల నుంచి బయటకు తీశారు. ప్రాణాలతో బయటకు వచ్చిన ఆ వ్యక్తి.. తన భార్య గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 40 మంది మృతి..
వెనెజువెలాలో గత నెల 24న వరుస భూకంపాలు సంభవించాయి. పలు నగరాల్లో భవనాలు కుప్పకూలగా దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. తాజాగా.. భూకంపం సంభవించిన ఎనిమిది రోజుల తరువాత శిథిలాల కింద నుంచి 43ఏళ్ల సెక్యూరిటీ గార్డు హెర్నాస్ అల్బెర్టో గిల్ ప్లోరెస్ ను సహాయక బృందాలు సజీవంగా బయటకు తీశాయి. ఆ సమయంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున గిల్ ప్లోరెస్ ను శిథిలాల కింద నుంచి బయటకు తీసుకొచొచ్చారు. ఆ సమయంలో అతని శరీరమంతా దుమ్ముపట్టి ఉంది.. అతడికి వెంటనే ఆక్సిజన్ మాస్క్ అమర్చి అంబులెన్సు ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఆయన తన భార్య గురించి మాట్లాడిన మాటలు అందరిని భావోద్వేగానికి గురిచేశాయి.
సహాయ సిబ్బంది గిల్ ప్లోరెస్‌ను శిథిలాల నుంచి బయటకు తీసిన తరువాత.. అతన్ని స్ట్రెచర్ పై పడుకోబెట్టి అతనికి ఆక్సిజన్ మాస్క్‌ను అమర్చారు. కొద్దిసేపటి తరువాత అతను మాట్లాడుతూ.. ‘‘నేను బతికున్నానని ఇప్పుడే నా భార్యకు చెప్పొద్దు.. ఒకవేళ నేను ప్రాణాలు కోల్పోతే ఆమె మరింత బాధపడుతుంది’’ అని రెస్క్యూ సిబ్బందిని కోరాడు. అయితే, శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడిన విషయాన్ని తెలుసుకున్న గిల్ ఫ్లోరెస్ భార్య గుస్బిమార్ గోన్సాలెజ్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కొద్ది రోజుల పాటు తన భర్తపై ఆశలు కోల్పోయానని తెలిపారు.
అతను బతికే ఉన్నాడని తెలిసిన క్షణం చీకట్లో ఒక వెలుగు కనిపించినట్టైందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ దంపతులకు 8, 10 ఏళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చిన్న క్యాబిన్ కాపాడింది..
గిల్ ఫ్లోరెస్ షాపింగ్ సెంటర్‌లో నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తొలి భూకంపం సంభవించిన సమయంలో అతను తన చిన్న సెక్యూరిటీ క్యాబిన్‌లో ఉన్నాడు. చుట్టూ ఉన్న భారీ కాంక్రీట్ నిర్మాణం మొత్తం కూలిపోయినా, క్యాబిన్ మాత్రం పూర్తిగా ధ్వంసం కాలేదు. దీంతో లోపల చిన్న గాలి ఖాళీ ఏర్పడి అతని ప్రాణాలు నిలిచాయి.
Hernán Gil, a 43-year-old security guard, survived eight days beneath a collapsed seven-story building in Catia La Mar, Venezuela. Rescuers from seven countries reached him after a three-day operation. The building came down in the country’s twin earthquakes. pic.twitter.com/AMYODt8ia2
— Open Source Intel (@Osint613) July 2, 2026
ఇదిలాఉంటే.. జూన్ 24న వరుసగా సంభవించిన రెండు భూకంపాలు ఉత్తర వెనిజులాలో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. వేలాది భవనాలు కూలిపోగా.. 2,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 11 వేల మందికి పైగా గాయపడ్డారు. లా గ్వైరా రాష్ట్రం అత్యధికంగా దెబ్బతింది.
