యూనిఫామ్‌లో ఉన్నా లేకున్నా.. పోలీసోడు డ్యూటీ చేస్తనే ఉంటాడని ఏదో సినిమాలో చెప్పినట్లు.. డేటింగ్‌లో ఉన్న ఇద్దరు పోలీసులు అలర్ట్ అవడంతో దొంగ క్షణాల్లో పారిపోయాడు. ఇదంతా సినిమా స్టైల్లోనే జరిగింది. ఓ డిన్నర్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఎలిజబెత్ టౌన్ పోలీస్ ఆఫీసర్లు.. చేస్ మెక్ కౌన్, నికోలె మెక్ కౌన్ తింటూ బిజీగా ఉన్నారు. ఇంతలో మాస్క్ వేసుకున్న వ్యక్తి ఒకరు లోపలికి చొరబడి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వమంటూ బెదిరిస్తున్నాడు.
అది చెవిన పడగానే ఇద్దరూ గన్‌లు తీసుకుని అతని వైపుకు పరిగెత్తారు. అంతే క్యాష్ కౌంటర్‌లో వ్యక్తిని బెదిరిస్తున్న దొంగ అది చూసి తుర్రమన్నాడు. రెస్టారెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఘటనను లూయీస్ విల్లే మెట్రో పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేశారు.
యూనిఫాం లేకుండా గన్ లతో బెదిరించడమే కాదు. ఆ తర్వాత వెంబడించి అతణ్ని అరెస్టు కూడా చేశారట. మరో చోట దొంగతనం చేసిన తీసుకొచ్చిన రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం డ్యూటీలో ఉన్నామా లేదా అనేది చూడకూడదు.. వారిని రక్షించడమే మన బాధ్యత అని ఆ మహిళా ఆఫీసర్ చెప్పుకొచ్చింది.
ఈ వీడియోను 7వేల ముందికి పైగా చూడగా ఐదున్నర వేల లైకులు దక్కించుకుంది.