తైవాన్‌లో భారీ భూకంపం.. భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు

తైవాన్ ను భారీ భూకంపం వణికించింది. తైవాన్ లోని తూర్పు నగరమైన హువాలియన్ కు 34 కిలో మీటర్లు దూరంలో భారత కాలమానం ప్రకారం

Taiwan Earthquake

Taiwan Earthquake : తైవాన్ ను భారీ భూకంపం వణికించింది. తైవాన్ లోని తూర్పు నగరమైన హువాలియన్ కు 34 కిలో మీటర్లు (21.13 మైళ్లు) దూరంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున 6.3తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం దాటికి రాజధాని తైపీలో భవనాలు కంపించాయి. భూకంపం 9.7కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా భవనాలు ఊగడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు