Earthquake : కొలంబియన్ రాజధానిలో భారీ భూకంపం
కొలంబియా దేశ రాజధాని బొగోటాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం అనంతరం సైరన్ మోగించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు....
- saleem sk
- Published On : August 18, 2023 / 06:30 AM IST
Colombian Earthquake
Earthquake : కొలంబియా దేశ రాజధాని బొగోటాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం అనంతరం సైరన్ మోగించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం సంభవించిన సమయంలో ఓ మహిళ పదో అంతస్తు భవనంపై నుంచి కిందకు దూకి మరణించిందని కొలంబియన్ అధికారులు చెప్పారు. (Earthquake Strikes Colombian Capital) బొగోటాకు ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్ కాల్వరియో పట్టణంలో భూకంప కేంద్రం ఉంది. దీని తర్వాత 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఏజెన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Hyderabad : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పైనుండి పడి ఒకరి మృతి, మరొకరికి గాయాలు
భయాందోళనకు గురైన వేలాది మంది నివాసితులు రాజధాని వీధుల్లోకి వచ్చారు. పెద్ద భవనాలు కంపించాయి. దీంతో సైరన్‌లు మోగించారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న విల్లావిసెన్సియో, బుకారమంగా, తుంజా, ఇబాగ్ నగరాల్లో భూకంపం సంభవించినట్లు సోషల్ మీడియా వినియోగదారులు నివేదించారు. అమెరికా రాయబారి ఫ్రాన్సిస్కో పాల్మీరీ బొగోటా హోటల్‌లో ప్రసంగిస్తుండగా భూకంపం సంభవించినట్లు వీడియోలో వెల్లడైంది.భూకంపం సంభవించగానే ఇళ్లలోని ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. వీధుల్లోనే భయంతో నిరీక్షించారు.
Rivaba Jadeja: మహిళా ఎంపీతో గొడవ పెట్టుకున్న రవీంద్ర జడేజా భార్య.. వీడియో వైరల్
భూకంపం సంభవించిన సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని లోపెజ్ సూచించారు. విలావిసెన్సియోలో కొండచరియలు విరిగిపడ్డాయి. 2008లో ఎల్ కాల్వరియోలో 5.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 11 మంది మరణించారు. భూకంపం వల్ల కొన్ని గృహాలు దెబ్బతిన్నాయి.
