ఈఫిల్ టవర్ 130 వ బర్త్ డే సెలబ్రేషన్స్

  • Publish Date - May 16, 2019 / 02:18 PM IST

ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నెలకొల్పి 130 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలు ఆకాశాన్ని తాకేలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఐకానిక్ టవర్ వద్ద పారిస్ ప్రభుత్వం కళ్లు మిరుమిట్లు గొలిపేలా లేజర్ షో ఏర్పాటు చేసింది. 1889లో వరల్డ్ ఫెయిర్‌ ప్రదర్శన కోసం నిర్మించిన ఈఫిల్ టవర్ 324 మీటర్ల ఎత్తు..7300 టన్నుల బరువు కలిగి ఉంటుంది.

ప్రతి ఏటా కనీసం 70 లక్షల మంది టూరిస్టులు ఈఫిల్‌ టవర్‌ని సందర్శిస్తుంటారు. ఫ్రాన్స్‌ దేశానికే తలమానికంగా నిలిచిన ఈ టవర్‌ని 1889లో నిర్మించిన తర్వాత కొన్నేళ్లకే కూల్చివేయాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయంటే ఆశ్చర్యపోక తప్పదు..ఇప్పుడదే ఈఫిల్‌ టవర్ ఫ్రాన్స్ దేశానికి కొన్ని కోట్ల ఆదాయం తెచ్చి పెడుతోంది.