ప్రాణాలతో పోరాడుతున్న దంపతులు కరోనాతో బాధపడుతూ ఒకరికొకరు చెప్పుకున్న వీడ్కోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. 80కి పైబడిన వయస్సులోనూ ఒకరిపై ఒకరు చూపించుకుంటున్న ప్రేమను కరోనా విడదీసింది. అత్యవసర చికిత్స కోసం ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వాళ్లిద్దరూ గుడ్ బై చెప్పుకుంటున్న వీడియో వైరల్ గా మారింది.
దీనిపై సోషల్ మీడియా సైతం అభినందనల వెల్లువ కురిపిస్తుంది. ఈ వృద్ధుల బాధ చాలా విచారకరంగా ఉంది. పరిస్థితి చేయి దాటినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి వీడియో షేర్ చేసినందుకు థ్యాంక్స్’, ‘ఇదెంత విచారించదగ్గ వీడియో.. వారి ప్రేమకు విధేయుడ్ని. జీవితపు అంచుల్లోనూ వారి ప్రేమ ఏ మాత్రం తగ్గడం లేదనేందుకు ఇది ఉదహరణ మాత్రమే’ ‘ఇది చాలా బాధాకరం’ అంటూ ట్వీట్ రిప్లైలు ఇస్తున్నారు.
What does a couple mean? Two elderly patients of #coronavirus #CoronarivusOutbreak in their 80s said goodbye in ICU, this could be the last time to meet and greet ??? pic.twitter.com/YKQIUM3YXJ
— Incoming Memes (@incoming_memes) February 2, 2020
చైనాలో ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 425 మంది మరణించినట్లు తెలిసింది. మరో 20 వేల మందికి పైగా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది.
చైనాలోని వూహాన్ నగరంలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్.. మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు తిరిగి వచ్చిన విద్యార్థుల్లో వ్యాధి లక్షణాలుండటంతో వారిని ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డులకు తరలించి పరీక్షిస్తున్నారు. కేరళలో 3 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్రంలో 51 మంది చైనా నుంచి రాగా వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స చేస్తున్నారు.