×
Ad

Elon Musk Net Worth : ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు.. అతని ఆస్తుల విలువెంతో తెలుసా..? భూమ్మీద అతనే టాప్.. తాజా లెక్కలివే..

Elon Musk Net Worth : టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Elon Musk Net Worth

Elon Musk Net Worth : టెస్లా సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భూమ్మీద అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా నిలిచాడు. ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. బుధవారం సాయంత్రం నాటికి ఎలాన్ మస్క్ ఆస్తుల నికర విలువ 500 బిలియన్ డాలర్లు (రూ. 41,07,500 కోట్లు) దాటేసింది. దీంతో అతను తొలి ట్రిలియనీర్ గా చరిత్ర సృష్టించే దిశగా వేగంగా దూసుకెళ్తున్నారు.

ఎలాన్ మస్క్‌కు టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్, స్టార్ లింక్, న్యూరాలింక్ వంటి సంస్థలు ఉన్నాయి. వాటిలో ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ప్రధానమైంది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల విబేధాలు నెలకొన్నాయి. దీంతో ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో టెస్లా షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని రోజుల క్రితం మస్క్ టెస్లాలో ఒక బిలియన్ విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అది ముదుపర్ల విశ్వాసాన్ని పెంచింది. దీంతో షేర్లు ధరలు కూడా పెరిగాయి.

Also Read: Gold Rate Today : ఇదికదా కావాల్సింది.. దసరా వేళ భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్క రాత్రిలోనే మొత్తం మారిపోయింది.. వెండి ధర అయితే..

ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీలో సెప్టెంబర్ 15 నాటికి 12.4శాతం వాటా కలిగి ఉన్నాడు.. అయితే, ఈ ఏడాదిలో సంస్థ షేర్లు 14శాతం పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 4శాతం పెరిగాయి. దీంతో ఆయన సంపద 9.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే, రానున్న రోజుల్లో మార్కెట్ విలువను భారీగా పెంచేందుకు టెస్లా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

రోబో ట్యాక్సీ, ఏఐ మార్కెట్‌ను భారీగా విస్తరించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. మస్క్ ఈ లక్ష్యాలను సాధిస్తే టెస్లా సంస్థ నుంచి ఆయనకు భారీ ప్రోత్సాహక ప్యాకేజీ కింద భారీగా షేర్లు సమకూరనున్నాయి. దాదాపు 900 బిలియన్ డాలర్లు సమకూరనున్నట్లు అంచనా. దీంతో మస్క్ సంపద విలువ ట్రిలియన్ డాలర్లు దాటిపోవచ్చునని అంచనా.

ఇదిలాఉంటే.. బుధవారం నాటికి దాదాపు 350.7 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ జాబితాలో మస్క్ తరువాత రెండో అత్యంత ధనవంతుడిగా ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ నిలిచారు. ఇదిలాఉంటే.. మస్క్ సంపద ఇదే వృద్ధి రేటును కొనసాగిస్తే. .2033 మార్చి నాటికి ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అవుతారని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది.