Floki Inu : కుక్క ఫొటో షేర్ చేసిన ఎలన్ మస్క్.. భారీగా పెరిగిన ‘ఫ్లోకి’ ధర
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు. మస్క్ ఏ వ్యాపారం చేసినా సంచలనమే అవుతుంది.
- kunduru Vinod
- Published On : October 14, 2021 / 11:08 AM IST
Floki Inu
Floki Inu : టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు. మస్క్ ఏ వ్యాపారం చేసినా సంచలనమే అవుతుంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మస్క్ తాజాగా అతడి కుక్కపై కూడా వ్యాపారం మొదలు పెట్టాడు. తన పెంపుడు కుక్క ‘ఫ్లోకీ ఇను’ పేరుమీద క్రిష్టో కరెన్సీ విడుదల చేశాడు మస్క్. ఎలన్ మస్క్ విడుదల చేసిన ఆ కాయిన్ రేటు భారీగా పెరిగింది. అతడి తమ్ముడు కింబాల్ మస్క్ అఫిషియల్ పార్ట్‌నర్‌గా ఉన్న క్రిప్టో కరెన్సీ ‘ఫ్లోకీ ఇను’ కాయిన్ వ్యాల్యూ ఒక్కసారిగా పెరగడంతో పెట్టుబడి దారుల పంటపండింది.
చదవండి : అమెజాన్ బాస్‌ను ఏకిపారేసిన మస్క్.. దావాలతో మా అంతరిక్ష యానం ఆగదు!
ఈ కాయిన్‌పై ట్రాన్సాక్షన్లు ప్రారంభమైన 3 నెలల్లో దాని విలువ 1500 శాతం పెరిగింది. అక్టోబర్ 4 ఫ్లోకి గురించి ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌తో ఫ్లోకీ ఇను వ్యాల్యూ రోజురోజకీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ కాయిన్ ఆగష్టు 8న ప్రారంభం అయింది.. ప్రారంభం రోజు దీని ధర $0.00000002గా ఉంది.. ఇక అక్టోబర్ 8 నాటికి $0.00006805 చేరింది. ఆ వ్యాల్యూ ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1000 నుంచి రూ.34లక్షలకు పెరిగిందన‍్న మాట. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు అతి తక్కువ కాలంలో భారీ లాభాలను ఆర్జించారు.
చదవండి : ప్రియురాలితో విడిపోయిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్
Floki Frunkpuppy pic.twitter.com/xAr8T0Jfdf
— Elon Musk (@elonmusk) October 4, 2021
