Elon Musk Grimes : ప్రియురాలితో విడిపోయిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన ప్రియురాలితో విడిపోయినట్లుగా 'పేజ్ సిక్స్' అనే వార్త పత్రిక తెలిపింది. గ్రైమ్ అనే యువతితో ఎలాన్ 2018 అక్టోబర్ నుంచ

Elon Musk Grimes : ప్రియురాలితో విడిపోయిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్

Elon Musk Grimes

Updated On : September 25, 2021 / 5:29 PM IST

Elon Musk Grimes : అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన ప్రియురాలితో విడిపోయినట్లుగా ‘పేజ్ సిక్స్’ అనే వార్త పత్రిక తెలిపింది. గ్రైమ్ అనే యువతితో ఎలాన్ 2018 అక్టోబర్ నుంచి డేటింగ్ చేస్తున్నారు. తాజాగా వీరు విడిపోయినట్లుగా పేజ్ సిక్స్ పేర్కొంది. కాగా వీరికి ఏడాది బాబు ఉన్నాడు. ఇక ఈ విషయంపై ఎలాన్ మస్క్ స్పందించారు. పేజ్ సిక్స్ వార్త సంస్థతో మాట్లాడుతూ.. తాము విడిపోయిన విషయం నిజమేనని తెలిపారు.

Sneha Dubey : పాకిస్థాన్..!అబద్దాలు ఇక చాలు..ఆక్రమిత ప్రాంతాలు వదిలివెళ్లు :యూఎన్ లో స్నేహా దూబే వార్నింగ్

 

Elon Musk With Lover

Elon Musk With Lover

తాను గ్రైమ్స్ స్నేహపూర్వకంగా విడిపోయినట్లు తెలిపారు. బాబు పోషణ ఇద్దరం తీసుకుంటామని వివరించాడు ఎలాన్.. ప్రస్తుతం ఇద్దరం కలిసే ఉన్నామని వివరించారు. కానీ ఎందుకు విడిపోయారన్నది చెప్పలేదు. ఇక ఎలాన్ మస్క్ కి మొత్తం అరుగులు పిల్లలు కాగా వీరిలో ఒకరు మృతి చెందారు. “వెస్ట్‌వరల్డ్” నటిని మస్క్ రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.

Grimes

Grimes