Sneha Dubey : పాకిస్థాన్.. అబద్దాలు ఇక చాలు..! ఐక్యరాజ్యసమితిలో స్నేహా దూబే వార్నింగ్

న్యూయార్క్ లో జరుగుతున్న యూఎన్ సమావేశంలో భారత ప్రతినిధి స్నేహా దూబే పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు. అబద్దాలు కట్టిపెట్టాలని..భారత్ ఆక్రమిత ప్రాంతాలను వదిలివెళ్లాలని వార్నింగ్..

Sneha Dubey : పాకిస్థాన్.. అబద్దాలు ఇక చాలు..! ఐక్యరాజ్యసమితిలో స్నేహా దూబే వార్నింగ్

Newyork Un Meeting 2021

India on POK : కశ్మీర్, లఢక్ వంటి పాక్ భారత్ సరిహద్దుల విషయంలో పాక్ తీరుపై ఐక్యరాజ్యసమితి వేదికగా భారత ప్రతినిధి స్నేహా దూబే పాక్ తీరుపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. భారత్-పాక్ సరిహద్దుల విషయంలో ముఖ్యంగా కశ్మీర్, లఢక్ లపై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు స్నేహాదూబే గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన వాడి వేడి వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ ను ఏకిపారేశారు. దీంతో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ ప్రస్తావనపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. న్యూయార్ లో జరుగుతున్న యూఎన్ సమావేశంలో ఇమ్రాన్ ప్రసంగిస్తు..జమ్మూ కాశ్మీర్ వివాదానికి భారత ప్రభుత్వం అరిష్టంగా పిలిచే పరిష్కారాన్ని మొదలుపెట్టిందని..2019 లో ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు. కాశ్మీర్‌లో భారత దళాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఐరాస సాధారణ సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంలో కశ్మీర్ పై చేసిన విమర్శలు, వ్యాఖ్యలను ఐరాసలో భారత ప్రథమ కార్యదర్శి స్నేహా దూబే తీవ్రంగా ఖండించారు.

Read more : Sneha Dubey : ఎవరీ స్నేహ దుబే..UN వేదికపై పాకిస్థాన్ తీరును చీల్చి చెండాడి..ప్రధాని ఇమ్రాన్ ను ఏకి పారేసిన ధీర..!!

పాకిస్తాన్ భారత్ విషయంలో అన్నీ అబద్దాలు చెబుతోందని..భారత్ అంతర్గత విషయాలను ప్రస్తావిస్తు ప్రపంచ వేదిక అయిన ఈ యూఎన్ సమావేశాల్లో ఇమ్రాన్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. దీనికి కచ్చితంగా భారత్ కౌంటర్ ఇస్తుందని ఆ హక్కు మాకు ఉందని ఆమె తేల్చి చెప్పారు. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ పై పదునైన పదాలను ఉపయోగిస్తు..‘‘పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తు..అగ్నిమాపక సిబ్బందిలా మారువేషం వేసుకుంది’’అంటూ స్నేహా దూబే గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతే కాదు ఐక్యరాజ్యసమితి వేదికగా స్నేహాదూబే భారత్ ప్రతినిధిగా పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘అక్రమ ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను పాకిస్తాన్ వెంటనే ఖాళీ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో పాక్ కు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా అయ్యింది. యూఎన్ వేదికపై స్నేహా దూబే ఇచ్చిన ఈ వార్నింగ్ తో భారత్ దేశ వ్యాప్తంగా ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.

Read more : Quad Meeting : ప్రపంచ శాంతి కోసమే క్వాడ్ సమావేశం..చైనా, పాక్ వైఖరిపై ఆగ్రహం

యూఎన్ వేదికపై ప్రధాని మెడీ ఏం మాట్లాడుతారా?అని ఎదురు చూస్తున్న సమయంలో స్నేహా దూబే ఇచ్చిన వార్నింగ్ సర్వత్రా ప్రసంశలు వెల్లువెత్తున్నాయి. కాగా..ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల్లో ఇండియా ప్ర‌తినిధిగా..ఫ‌స్ట్ సెక్ర‌ట‌రీగా స్నేహ దూబే ఉన్న విషయం తెలిసిందే. UNGA లో నిన్న సాయంత్రం ప్రసారమైన తన ప్రీ-రికార్డ్ ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ భారత్ పై చేసిన వ్యాఖ్యలకు స్నేహా దూబే తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.

ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్‌లో భారత దళాలు చేసిన స్ధూల, క్రమబద్ధమైన మానవ హక్కుల ఉల్లంఘన ఇది అని..దీనిపైనే భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోదంటూ వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్నేహా దూబే కాస్త ఘాటుగా స్పందించారు. పాక్ ఇటువంటి ప్రకటనలు చేస్తు..అబద్దాన్ని పదే పదే చెప్పాలని ప్రయత్నిస్తున్నారనీ..ఇలా అబద్దాన్ని పదే పదే చెప్పినా అది నిజం కాదని తెలుసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ కు చురకలు అంటించారు. ఇటువంటి ఆరోపణలు చేసే ఇమ్రాన్ ఖాన్ పట్ల మనం అంటే భారత్ సానుభూతి చూపడం తప్ప ఇంకేమీ చేయలేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇమ్రాన్ వ్యాఖ్యలకు మేం అక్కడా సమాధానం ఇస్తామని ఆమెదైన శైలలో కౌంటర్ ఇచ్చారు.

Read more : NSG,UNSCలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనన్న బైడెన్

స్నేహా దూబే బాణాలు అక్కడితో ఆగలేదు. ‘‘పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ దేశాల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని.. సాధారణ ప్రజలు ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల ప్రజల జీవితాలు తలక్రిందులు అవుతున్నా పట్టించుకునే తీరిక పాకిస్తాన్ కు లేదనీ..అటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్థాన్ లో తీవ్రవాదులు మాత్రం స్వేచ్ఛగా విహరిస్తున్నారని..అటువంటి దేశం మానసిక స్ధితికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. పాకిస్థాన్ పరిస్థితి అలా ఉంటే భారతదేశం మాత్రంలో మాత్రం మైనారిటీలు గణనీయమైన జనాభాతో అత్యున్నత పదవులను కలిగి ఉన్నారని తెలిపారు.

మైనార్టీల విషయంలో భారత్ పెద్ద మనస్సుతో వ్యవహరిస్తు..ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతోందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారికి సహాయం చేయడం, మద్దతునిస్తున్న విషయాన్ని ప్రపంచదేశాలు అర్ధం చేసుకుంటున్నాయని స్నేహా దూబే అన్నారు. ఇప్పుడు ఇమ్రాన్ తన ప్రసంగం ద్వారా తమ నిజస్వరూపాన్ని వెల్లడించారని స్నేహా దూబే అన్నారు. ఇలా భారత్ విషయంలో పాక్ అబద్దాల ధోరణిని భారత్ ప్రతినిథిగా స్నేహా దూబే ఎక్కడిక్కడ కౌంటర్లు ఇస్తు భారత్ దేశ వ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్నారు.