Quad Meeting : ప్రపంచ శాంతి కోసమే క్వాడ్ సమావేశం..చైనా, పాక్ వైఖరిపై ఆగ్రహం

అమెరికా నేతృత్వంలో క్వాడ్ సభ్య దేశాధినేతలు మొదటిసారి ప్రత్యక్షంగా వైట్‌హౌస్‌ వేదికగా సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోదీ

10TV Telugu News

Quad Meeting అమెరికా నేతృత్వంలో క్వాడ్ సభ్య దేశాధినేతలు మొదటిసారి ప్రత్యక్షంగా వైట్‌హౌస్‌ వేదికగా సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోదీ,ఆస్ట్రేలియా ప్రధాని స్కాల్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా… కొవిడ్‌, పర్యావరణమార్పులు,ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లతో పాటు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం ప్రధానం అజెండాగా సమావేశం సాగింది. ప్రస్తుత కాలంలో అత్యంత క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి ప్రజాస్వామ్య దేశాలు మాత్రమే కలిసి పనిచేయగలవని క్వాడ్ దేశాధినేతలు ముక్త కంఠంతో నినదించారు.

క్యాడ్ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన బైడెన్.. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ నాలుగు ప్రజాస్వామ్య దేశాలు కోవిడ్ నుంచి వాతావరణ మార్పులు వంటి ఉమ్మడి సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొంటామని తెలిపారు. సవాళ్లను ఎదుర్కొని పనులను ఎలా పూర్తి చేయాలో మాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్యాడ్ దేశాల విద్యార్థుల కోసం స్టెమ్ ఫెలోషిప్‌ను ప్రకటించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం క్యాడ్ ఓ శక్తిగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.

ఈ క్వాడ్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి ..భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దన్యవాదాలు తెలిపారు. క్వాడ్‌లో అందించుకుంటున్న పరస్పర సహకారం ఇండో-పసిఫిక్‌ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతిస్థాపనకు, అంతర్జాతీయ సౌభాగ్యానికి దోహదపడుతుందని విశ్వసిస్తున్నాని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ శ్రేయస్సు కోసం పని చేసే శక్తి క్వాడ్‌ కూటమి అని పేర్కొన్నారు. క్వాడ్‌ రూపొందించిన టీకా కార్యక్రమం ఇండో-పసిఫిక్‌ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. 2004లో జపాన్‌లో సునామీ విధ్వంసం సృష్టించినప్పుడు తామంతా కలిసికట్టుగా పనిచేశామని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ రోజున ప్రపంచం COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు, మానవజాతి సంక్షేమం కోసం మేము మరోసారి క్వాడ్‌గా ఇక్కడకు వచ్చాం అని మోదీ అన్నారు.

ALOS READ NSG,UNSCలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనన్న బైడెన్

ఇక, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం కోరుకుంటున్నామని చైనాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతర్జాయతీ చట్టాలకు అనుగుణంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వివాదాలను పరిష్కరించి, స్వేచ్ఛ, శాంతిని నెలకొల్పాలని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ కోరారు. జపాన్ జపాన్ ప్రధాని సుగా.. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య సమస్య, జపాన్ బియ్యం, ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రస్తావించారు. వీటిపై నిషేధం ఎత్తివేసినందుకు ఆమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని పెంచిపోషించే దేశాల తీరును తాము ఖండిస్తున్నామని క్వాడ్​ సదస్సు అనంతరం… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్​ ప్రధాని యొషిహిదే సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ లు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా పాకిస్థాన్​పై పరోక్ష విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించే విధానాలను ఖండిస్తున్నాం. ఆర్థికంగా, సైనిక, ఇతర ఏ విధంగానూ ఉగ్రవాద ముఠాలకు సాయం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నాం. దాని ద్వారా సరిహద్దుల్లో దాడుల వంటి ఉగ్రదాడులకు దారి తీస్తుంది. అప్ఘానిస్తాన్ భూభాగం ఉగ్ర ముఠాలకు అడ్డాగా మారకూడదు. అప్ఘాన్ లో ఉగ్రవాదం నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అఫ్ఘానిస్తాన్​ విషయంలో క్వాడ్​ దేశాలు సమన్వయంతో ముందుకు సాగుతాయి. అప్ఘాన్ పౌరులకు మద్దతుగా నిలుస్తాం. దేశాన్ని వీడాలనే పౌరులకు సురక్షిత సౌకర్యాలను కల్పించాలని తాలిబన్లను కోరుతున్నాం. మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులను తాలిబన్లు గౌరవించాలి అని ఉమ్మడి ప్రకటనలో క్వాడ్ దేశాధినేతలు పేర్కొన్నారు.

ALSO READ Modi-Kamala Harris : యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌కి మోదీ అపూర్వ కానుక

చైనాను పేరు నేరుగా ప్రస్తావించకుండా.. “ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, భద్రత మరియు శ్రేయస్సు కోసం క్వాడ్ ఒక శక్తి”అని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. సముద్రపు చట్టం (UNCLOS) పై UN ఒప్పందానికి కట్టుబడి పసిఫిక్, తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రాలలో “చిన్న ద్వీప రాష్ట్రాలకు” క్వాడ్ మద్దతును ఇస్తుందని పేర్కొంటూ.. చైనా-తైవాన్ టగ్ ఆఫ్ వార్ మరియు చైనా మరియు జపాన్ మధ్య సెంకాకు దీవుల విషయంలో ఉద్రిక్తతల గురించి క్వాడ్ నాయకులు ఉమ్మడి ప్రకటనలో పరోక్షంగా ప్రస్తావించారు.