NSG,UNSCలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనన్న బైడెన్

మ‌రో కీల‌క అంశంలో భార‌త్ కు అగ్ర‌రాజ్యం మ‌ద్ధ‌తు ల‌భించింది. ప్రపంచ శాంతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో శాశ్వత సభ్యత్వం

NSG,UNSCలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనన్న బైడెన్

Bidemodi (2)

UNSC మ‌రో కీల‌క అంశంలో భార‌త్ కు అగ్ర‌రాజ్యం మ‌ద్ధ‌తు ల‌భించింది. ప్రపంచ శాంతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు అమెరికా మద్దతు ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్..వైటె్ హౌస్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా మరోసారి సృష్టం చేశారు. అదేవిధంగా,న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లోకి భారత్ ప్రవేశం విషయంలో కూడా అమెరికా మద్దతు ఉంటుందని బైడెన్ తెలిపారు.

వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తో..శుక్రవారం ప్రధాని మోదీ భేటీ ముగిసిన తర్వాత యూఎస్-ఇండియా నేతలు విడుదలు చేసిన సంయుక్త ప్రకటనలో.. ఆగస్టు నెలలో UNSC అధ్యక్ష హోదాలో ఉన్న భారత్.. ఆప్ఘనిస్థాన్ సంక్షోభ సమయంలో సమర్థంగా పనిచేసిందని జో బైడెన్ కొనియాడారు. ఈ నేపథ్యంలోనే భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలని తాను భావిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ఐక్య‌రాజ్య‌స‌మితి వ్య‌వ‌స్థాప‌క దేశాల్లో ఇండియా కూడా ఒక‌టని… ఏడుసార్లు తాత్కాలిక స‌భ్య‌దేశంగా కూడా ప‌నిచేసిందని జో బైడెన్ గుర్తుచేశారు.

ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో మొత్తం 15దేశాలుంటాయి. ఇందులో 5 దేశాల‌కు మాత్ర‌మే శాశ్వ‌త స‌భ్య‌త్వం ఉంది. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్… ఈ ఐదూ మండలిలో శాశ్వత సభ్య దేశాలు. ఏదైనా తీర్మానాన్ని వీటో(తిరస్కరణ) చేసే అధికారం ఈ దేశాలకు ఉంది. మిగిలిన దేశాల‌ను రెండు సంవ‌త్సరాల కాల‌ప‌రిమితితో తాత్కాలిక స‌భ్య దేశంగా ఎన్నుకుంటారు. ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్‌కు ఇప్పటికే శాశ్వత సభ్యత్వం రావాల్సి ఉంది. కానీ, చైనా, పాక్ దేశాలు అడ్డుపుల్లలు వేస్తున్న విషయం తెలిసిందే. వీటో పవర్ ను వాడుకుంటూ చైనా ఆయా దేశాల డిమాండ్ ను కొట్టిపారేస్తోంది. దీంతో భారత్ కొన్నేళ్లుగా తాత్కాలిక సభ్యదేశంగానే కొనసాగుతోంది.

భారత్‌కి శాశ్వత సభ్య దేశం గుర్తింపు వస్తే… చైనా పని అయిపోయినట్లే. ఇన్నాళ్లూ దీన్ని అడ్డం పెట్టుకొనే… చైనా అంతర్జాతీయ స్థాయిలో ఇండియా కంటే పెద్ద దేశంగా చెలామణీ అవుతోంది. లేని డాంబికాలు ప్రదర్శిస్తూ… ఇండియాకి అడుగడుగునా ఇబ్బందులు కలిగిస్తోంది. ఇండియా పర్మనెంట్ సీటు దక్కించుకుంటే… తన ఆటలు సాగవన్న ఉద్దేశంతోనే దశాబ్దాలుగా ఈ కల నెరవేరకుండా అడ్డుకుంటోంది చైనా. అంతర్జాతీయ ఒప్పందాలు, తీర్మానాల్లో భారత్ కూడా వీటో పవర్ ఉపయోగించే పరిస్థితి రావాలి. మారిన అంతర్జాతీయ పరిస్థితుల వల్ల UNSCలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది.

మరోవైపు, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్‌ఎస్‌జి) లో భారత్ ప్రవేశానికి అమెరికా మద్దతును పునరుద్ఘాటించారు బైడెన్. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లేదా NSG అనేది 48 మంది సభ్యుల సమూహం. ఇది ప్రపంచ అణు వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది. మే 2016 లో NSG సభ్యత్వం కోసం భారతదేశం దరఖాస్తు చేసినప్పటి నుండి, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పై సంతకం చేసిన దేశాలను మాత్రమే NSGలోకి అనుమతించాలని చైనా పట్టుబడుతోంది.
NPT లో భారత్ మరియు పాకిస్తాన్ సంతకాలు చేయలేదు. భారత్ దరఖాస్తు తరువాత, పాకిస్తాన్ కూడా 2016 లో NSG సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది.

కాగా, మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. శుక్రవారం యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌తో వైట్ హౌస్ లో కీలక అంశాలపై చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జో బైడెన్‌తో ప్రధాని మోడీ కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ భేటీలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని, సత్ససంబంధాలు మరింత దృఢంగా కొనసాగుతాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అమెరికాలోని భారత కమ్యూనిటీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భారతీయ నిపుణులకు ఎంతో కీలకమైన హెచ్1బీ వీసా అంశంపైనా బైడెన్‌తో చర్చించారు. ఈ మేరకు వివరాలను విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా వెల్లడించారు. అనేక మంది భారతీయ నిపుణులు అమెరికాలో పనిచేస్తున్నారని, మరికొంత మంది యూఎస్ కి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక్కడ భారతీయ నిపుణులకు లభించే ప్రాధాన్యతను బట్టి ఈ దేశానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఈ దేశానికి వారు తమవంతుగా సేవలనందిస్తున్నారని తెలిపారు. అమెరికా ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.