Sneha Dubey : ఎవరీ స్నేహ దుబే..UN వేదికపై పాకిస్థాన్ తీరును చీల్చి చెండాడి..ప్రధాని ఇమ్రాన్ ను ఏకి పారేసిన ధీర..!!

స్నేహ దూబే. ఐక్యరాజ్యసమితి వేదికపై పాకిస్థాన్ దేశపు తీరుని..ప్రధాని ఇమ్రాన్ ను ఏకిపారేసిన ధీర. వాడి వేడి మాటలతో పాక్ ను చీల్చి చెండాడిన స్నేహాదూబే హాట్ టాపిక్ గా మారారు.

Sneha Dubey : ఎవరీ స్నేహ దుబే..UN వేదికపై పాకిస్థాన్ తీరును చీల్చి చెండాడి..ప్రధాని ఇమ్రాన్ ను ఏకి పారేసిన ధీర..!!

Sneha Dubey.. Tore Pakistan An Newyork Un Meeting

Sneha Dubey.. tore pakistan an Newyork un meeting : స్నేహ దూబే. ఐక్యరాజ్యసమితి వేదికపై పాకిస్థాన్ దేశపు తీరుని..ప్రధాని ఇమ్రాన్ ను కూడా లెక్క చేయకుండా ఏకిపారేసిన ధీర స్నేహ దూబే గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల్లో ఇండియా ప్ర‌తినిధిగా ఆమె మాట్లాడారు. ఫ‌స్ట్ సెక్ర‌ట‌రీగా స్నేహ దూబే.. పాకిస్థాన్ వైఖ‌రిని యూఎన్ సాక్షిగా ఏకిపారేశారు. అంతేకాదు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను కూడా తనదైన స్టైల్లో ఏకిపారేశారు స్నేహా దూబే. 2012 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్‌. అమెరికాలోని న్యూయార్క్‌లో జ‌రుగుతున్న యూఎన్ స‌మావేశాల్లో పాల్గొన్న ఆమె ఇండియా ప్ర‌తినిధిగా ఫ‌స్ట్ సెక్ర‌ట‌రీగా మాట్లాడుతు పాకిస్థాన్ తీరుపై మండిపడ్డారు. జమ్ము కాశ్మీర్ -లఢఖ్ ఎప్పటికీ భారత్ వే నని ఆమె తేల్చిచెప్పారు. కశ్మీర్ మాది..లఢక్ మాది అంటూ పాకిస్థాన్ వ్యవహరించేతీరుపై ఆమె యూఎన్ సాక్షిగా ఏకిపారేస్తు ఈ రెండు ఇప్పటికీ ఎప్పటికీ భారత్ వేనని తేల్చిచెప్పారు.

Read more : ‘ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్’.. ‘షీ పాహి’ కార్యక్రమంలో అనుష్క..

భారత్ విషయంలో పాక్ తీరు..ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యలు సరికావని ఈ విషయం ఇమ్రాన్ గుర్తించాలంటూ చిచ్చరపిడుగుల తనదైన శైలిలో స్నేహాదూబే పదునైన పదాలతో కౌంటర్ ఇస్తు యూఎన్ లో అందరిని ఆకట్టుకున్నారు. దీంతో మొత్తం ప్రపంచం అంతా స్నేహదూబే గురించే మాట్లాడుకునేలా చేసింది. ఆమె మాటల తూటాలను విన్నవారంతా నెట్ లో ఆమె గురించే సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారు? ఆమె నేపథ్యం ఏంటీ అని తెలుసుకుంటున్నారు. మరి ఆ ఈ భారతనారీమణి స్నేహాదూబే గురించి తెలుసుకోవాల్సిందే..

యూఎన్‌లో ఇండియా త‌ర‌పున ఫ‌స్ట్ సెక్ర‌ట‌రీగా ఉన్న స్నేహ దూబే..ఆమె స్కూల్ ఎడ్యుకేషన్ అంతా గోవాలో పూర్తి చేశారు. తరువాత పుణెలోని ఫెర్గూస‌న్ కాలేజీలో చదువుకున్నారు. ఉన్నత విద్య కూడా అక్కడే పూర్తి చేశారు. ఢిల్లీలోని జ‌వ‌ర్‌లాల్ నెహ్రూ స్కూల్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీస్ లో ఎంఫిల్ చదివారు. ఇండియ‌న్ ఫారిన్ స‌ర్వీసెస్‌లో ఉద్యోగం చేయాలని ఆమె కల..చిన్నప్పటినుంచి ఆమె అదే లక్ష్యంగా చదువుకున్నారు. అలా చదువులో రాణిస్తు ఒక్కో మెట్టే ఎక్కుతు..2011లో సివిల్ స‌ర్వీసెస్ రాసారు. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే పాస్ అయ్యారు కూడా.

Read more : Indian Army : ఆర్మీలో ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్ హోదా

అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల గురించి నేర్చుకోవాలనే ఆమె తపన ఫారిన్ స‌ర్వీసెస్‌పై దృష్టి పెట్టారు. కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవటం..ఆ ప్రాంతపు సంస్కృతుల‌ గురించి క్షుణ్ణంగా తెసుకోవాలనే ఆమె తపన ఆమెది. భారత్ తీసుకునే కీల‌క‌మైన విధాన నిర్ణ‌యాల్లో ప్రతినిథిగా తాను ఉండాలని ఆమె నిరంతరం తపనపడేవారు.

ఆమె ఏదైతే చిన్ననాట అనుకుందో ఆ దిశగా అడుగులు వేస్తు తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. అలా ఆమె కుటుంబం నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగంలో చేరిన మొద‌టి వ్య‌క్తిగా స్నేహ దూబే ఓప్రత్యేకత సంతరించుకున్నారు. స్నేహ తండ్రి ఓ మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. త‌ల్లి స్కూల్ టీచ‌ర్‌గా పనిచేస్తున్నారు. ఫారిన్ స‌ర్వీస్‌కు సెలెక్ట్ అయ్యాక స్నేహ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ‌లో అపాయింట్ అయ్యారు. ఆమె జాబ్ కెరీర్ లో తొలి అడుగు తనకు నచ్చిన విదేశీ వ్యవహారాల శాఖలో కావటంతో ఆమె హ్యాపీ ఫీల్ అయ్యారు. అలా 2014లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని ఎంబ‌సీలో ఆమె తొలి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఈ క్రమంలో ప్ర‌స్తుతం యూఎన్‌లో ఇండియా ఫ‌స్ట్ సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతున్నారు. ఈ యూఎన్ వేదికను ఆమె దేశం తరపున ప్రతినిథిగా పొరుగు దేశమైన పాకిస్థాన్ ను తన వాడి వేడి మాటలతో చీల్చి చెండాడారు.

యూఎన్‌లో స్నేహ దూబే పాకిస్థాన్ తీరుపై మాట్లాడిన తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమె పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ జడివాన కురుస్తోంది. ప‌దునెక్కిన ప‌దాల‌తో పొరుగు దేశాన్ని చీల్చిచెండాడిన‌ తీరు సూప‌ర్బ్ అంటున్నారు. అవసరానికి మించి ఒక్క మాటకూడా మాట్లాడకుండా సమతూకంతో అనుభాలు పండిపోయిన వారిలా ప్ర‌తి మాట‌ను చాలా జాగ్ర‌త్త‌గా..వాడిగా వేడిగా డైరెక్ట్ గా పాక్ కి కౌంటర్ ఇచ్చేలా మాట్లాడిన తీరు నిజంగా హర్షణీయం అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.

Read more : Manipur iron womens : వెయిట్​లిఫ్టింగ్​ లో​ మణిపూర్ ఉక్కు మహిళలు

నిజాల‌ను నిర్భ‌యంగా చెప్పిన ఆమె తెగువ..ధైర్యం నిజంగా హ్యాట్సాఫ్ అంటున్నారు. గ‌తంలో కూడా యూఎన్‌లో ఇండియా త‌ర‌పున మ‌హిళా ప్ర‌తినిధులు కూడా వాడి వేడిగానే మాట్లాడారు. అయినా సరే స్నేహాదూబే వాక్చాతుర్యం మాత్రం అందరిని ఆకట్టుకుంది.గంభీర్‌, విదిషా మైత్రా త‌ర‌హాలోనే స్నేహ కూడా పాక్ భ‌ర‌తం ప‌ట్టింద‌ని..కానీ స్నేహా స్టైలే వేరుగా ఉందని సోష‌ల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

Read more : ఆకాశమంతా వారిదే..! : ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో సత్తా చాటుతున్న అతివలు

యూఎన్ వేదికపై ప్రధాని మోడీ ఏం మాట్లాడుతారు? అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో యూఎన్ సమావేశంలో ప్రధాని ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ కంటిన్యూ అవుతున్న సమయంలో..స్నేహ దుబే పాకిస్థాన్ కు ఇచ్చిన సమాధానం..పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను పదునైన అస్త్రాలతో తిప్పి కొట్టిన తీరు..మాటకు మాటా అంటూ ఎన్ కౌంటర్ లాంటి మాటలతో చీల్చి చెండాడిన తీరుపై హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇప్పుడు భారత దేశవ్యాప్తంగా ఒక్క సారిగా స్నేహ పేరును పతాక స్థాయికి తీసుకెళ్లాయి ఆమె పాక్ కు కౌంటర్ ఇచ్చిన తీరు…