ఆకాశమంతా వారిదే..! : ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో సత్తా చాటుతున్న అతివలు

ఆకాశమంతా వారిదే..! : ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో సత్తా చాటుతున్న అతివలు

International Women’s Day Special Story : భారత అమ్ముల పొదిలో పాశుపతాస్త్రం ఏదీ అంటే.. ఇప్పుడు అందరూ చెప్పే పేరు రాఫెల్. ఎయిర్‌ఫోర్స్‌లోకి అది ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం అన్నట్టు.. డ్యూటీలో చేరిపోయింది. లద్ధాఖ్‌లో చక్కర్లు కొట్టి డ్రాగన్‌కు వార్నింగ్స్ పంపించింది కూడా ఈ ఫైటర్ జెట్టే.. అటువంటి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బాహుబలిని కంట్రోల్ చేస్తున్నారు మహిళలు. అంబాలా ఎయిర్‌బేస్‌కు వెళ్లి.. గాల్లో గిరికీలు కొట్టిస్తున్నారు. ఇంతకీ ఎవరా మహిళలు?..

ఎక్కువ సమయం విధులు నిర్వహించాల్సి రావడం.. వీరికి ఇచ్చే క్వార్టర్స్‌లో ఇబ్బందులు, టాయ్‌లెట్స్ సహా.. పలు కారణాలతో ఇన్నాళ్లూ అధికారులుగా మహిళ సేవలను గతంలో ఎయిర్‌ఫోర్స్‌ వినియోగించుకోలేదు. కానీ.. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ భావించడంతో.. మహిళా అధికారులు నేవీ అబ్జర్వర్ కోర్సును కంప్లీట్ చేసుకున్నారు. నేవీ ఉపయోగించే మల్టీపర్పస్ యూసేజ్ హెలికాప్టర్లు, ఇంటెలిజెన్స్, నిఘా పరిశీలన, సెన్సార్ ఆపరేటింగ్‌తో పాటు వివిధ అంశాల్లోనూ శిక్షణ తీసుకున్నారు. నౌకాదళం​ అమ్ములపొదిలోకి వచ్చిన అత్యాధునిక ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లలో విధులు కూడా నిర్వర్తిస్తున్నారు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌‍లో అత్యంత కీలకంగా, ప్రతిష్టాత్మకంగా మారిన రాఫెల్ యుద్ధ విమానాలను మహిళా పైలెట్లు కూడా నడిపించేందుకు గత ఏడాది కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్‌‍ఫోర్స్‌లో అందుబాటులో ఉన్న వార్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పోల్చుకుంటే.. రాఫెల్ అత్యాధునికమైనవి. దీన్ని నడిపించడానికి వాయుసేన పైలెట్లకు రక్షణశాఖ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది కూడా. బృందాల వారీగా ఎంపికైన పైలట్లలో 10 మంది ఎయిర్‌ఫోర్స్ మహిళా పైలెట్లు కూడా ఉన్నారు. 17వ స్క్వాడ్రన్‌లోకి వారు విధులు నిర్వర్తిస్తున్నారు.

2016లో మహిళను ఫైటర్ పైలట్లుగా నియమించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. ఆ తర్వాతి ఏడాది.. అంటే.. 2017లో ఐఏఎఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మహిళలు. 2017లో ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన వాళ్లు.. రెండో బ్యాచ్‌లో ఫైటర్‌ పైలట్‌లుగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటికే.. మిగ్‌లతో చెలరేగిన మగువలు.. ఏమాత్రం అవకాశం వచ్చినా.. దేశం కోసం రాఫెల్‌తో కూడా శత్రుదేశాలపైకి దూకేందుకు సై అంటే సై అంటున్నారు.

ఇప్పుడు చెప్పండి వాళ్లు అబలలా? లేక సబలలా? అన్ని రంగాల్లో దూసుకు పోతున్న వారిని అ బలలు అనడం మన దుర్బవలత్వం కాదా? ఆలోచించండి.. అందుకే మహిళా మణులు ఆకాశంలో సగం కాదు ఆకాశమంతా ఆమే. ఆకాశమే హద్దుగా విజయకేతనాలకు ఎగురవేస్తున్నారు మహిళలు.