Elon Musk: స్పామ్ అకౌంట్ల లెక్కతేలనిదే ట్విట్టర్ కొనేదిలేదంటోన్న ఎలన్ మస్క్

సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఎలన్ మస్క్ కండిషన్ ను చాలా సీరియస్ గా వినిపిస్తున్నారు. ఆ ప్లాట్ ఫాంకు సంబంధించిన స్పామ్ అకౌంట్ల జాబితా 5శాతం కంటే తక్కువేనని తేలనిదే కొనేది లేదంటున్నారు.

Elon Musk: సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఎలన్ మస్క్ కండిషన్ ను చాలా సీరియస్ గా వినిపిస్తున్నారు. ఆ ప్లాట్ ఫాంకు సంబంధించిన స్పామ్ అకౌంట్ల జాబితా 5శాతం కంటే తక్కువేనని తేలనిదే కొనేది లేదంటున్నారు. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగ్రవాల్ లేటెస్ట్ స్టేట్మెంట్ తర్వాత ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ కనీసం 20శాతం స్పామ్ బోట్లను కలిగి ఉందని మస్క్ చెబుతున్నారు.

ఈ మూడు నెలల్లోనే మైక్రోబ్లాగింగ్ సైట్‌లో దాదాపు 5 శాతం స్పామ్ ఖాతాలు ఉన్నాయని ట్విట్టర్ వెల్లడించారు. Tesla CEO Twitter వాదనలను కొట్టిపారేశారు. కొనుగోలు చేయాలనుకున్న ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికీ “సముపార్జనకు కట్టుబడి ఉన్నానని” మస్క్ తరువాత స్పష్టం చేశాడు.

ట్విటర్‌ను మొదట ఆఫర్ చేసిన దానికంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికే మస్క్ ఈ వ్యూహాలు పన్నుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిలియనీర్ గత నెలలో $44 బిలియన్ల నగదుతో మైక్రోబ్లాగింగ్ సైట్‌ను కొనుగోలు చేస్తానంటూ ముందుకొచ్చాడు. టెస్లా CEO మస్క్ తన వాటాను వెల్లడించి.. ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి కంపెనీ స్టాక్ తన లాభాలన్నింటినీ కోల్పోయింది.

Read Also: ఎలాన్ మస్క్ టేకోవర్‌కు ముందు.. ట్విటర్ నుంచి ఇద్దరు ఔట్..

బిలియనీర్ ట్విటర్ బిడ్‌ను వీలైనంత తక్కువగా పొందడానికి ప్రయత్నిస్తున్నాడని చెబుతున్నారు. సోమవారం మియామీలో జరిగిన సమావేశంలో మస్క్ మాట్లాడుతూ, “వారు క్లెయిమ్ చేసిన దానికంటే చాలా దారుణమైన దానికి అదే ధరను చెల్లించలేనం”టూ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు