Twitter: ఎలాన్ మస్క్ టేకోవర్‌కు ముందు.. ట్విటర్ నుంచి ఇద్దరు ఔట్..

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ట్విటర్‌లో కీలక మార్పులు చోటు చేసుకుటున్నాయి. త్వరలోనే ట్విటర్ ను టేకోవర్ చేసుకొనేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతుండగా.. మస్క్ సూచనల మేరకు ట్విటర్ లో మార్పులు ...

Twitter: ఎలాన్ మస్క్ టేకోవర్‌కు ముందు.. ట్విటర్ నుంచి ఇద్దరు ఔట్..

Twitter

Twitter: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ట్విటర్‌లో కీలక మార్పులు చోటు చేసుకుటున్నాయి. త్వరలోనే ట్విటర్ ను టేకోవర్ చేసుకొనేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతుండగా.. మస్క్ సూచనల మేరకు ట్విటర్ లో మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్ ద్వారానే కీలక మార్పులు చేర్పులను మస్క్ చేపడుతున్నారు. తాజాగా ఇద్దరు ఉద్యోగులు ట్విటర్ నుంచి వైదొలిగారు. సీఈవో పరాగ్ అగర్వాల్ సూచనల మేరకు తాము వైదొలుగుతున్నట్లు సదరులు ఉద్యోగులు వెల్లడించారు. ట్విటర్ నుంచి వైదొలగిన వారిలో క‌న్జూమ‌ర్ ప్రొడ‌క్టు మేనేజ‌ర్ క‌వ్యోన్ బెయ్క్‌పూర్‌, రెవెన్యూ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ బ్రూస్ ఫాల్క్ ఉన్నారు. వీరు ట్విటర్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు.

Twitter Deal Row: ట్విట్టర్ డీల్ వెనుక ట్రంప్ ఉన్నాడా?: ఎలాన్ మస్క్ ఏమన్నారంటే!

అయితే ఎలాన్ మస్క్ ట్విటర్ ను టేకోవర్ చేసుకున్న తరువాత కీలక మార్పులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఇద్దరు కీలక ఉద్యోగులు వైదొలగడంతో మరికొందరు సైతం ట్విటర్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాను ట్విటర్ నుంచి వైదొలుగుతున్నానని బెయ్క్‌పూర్‌ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇది నేను ముందు ఊహించానని తెలిపారు. ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ తనకు మేయిల్ పంపించారని, దానిలో ట్విట్ట‌ర్‌ను ఎలాన్‌ మ‌స్క్ టేకోవ‌ర్ చేయ‌డానికి ముందు సంస్థ‌ను విభిన్న మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు అవ‌స‌ర‌మైన టీమ్ సిద్ధం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నామని, అందుకు మీరు వైదొలగాలని కోరినట్లు అగర్వాల్ కోరినట్లు తెలిపారు. మరోవైపు రెవెన్యూ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ బ్రూస్ ఫాల్క్ కూడా ట్విటర్ నుంచి వైదొలిగారు.

Twitter Employees : ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన.. జాబ్ మానేస్తారా?.. పోతే పోండి.. డోంట్ కేర్ అంటున్న మస్క్..!

ఐదేళ్లుగా ట్విటర్ లో పనిచేస్తున్న అతను పరాగ్ అగర్వాల్ ఆదేశాలతో ట్విటర్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన ట్విట్ట‌ర్ కో-ఫౌండ‌ర్ జాక్‌డోర్సీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అయితే వీరి స్థానంలో జాయ్ సులివ‌న్ తాత్కాలికంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మరోవైపు సంస్థ‌లో నియామ‌కాలు చేప‌ట్టొద్ద‌ని, ఖ‌ర్చు నిలువ‌రించాల‌ని, లేఆఫ్‌లు ఉండ‌బోవ‌ని ఇప్పటికే సీఈవో ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎలాన్ మస్క్ ట్విటర్ టేకోవర్ కు ముందే తనకు కావాల్సిన రీతిలో ఉద్యోగులను సంసిద్ధులను చేస్తున్నట్లు కనిపిస్తోంది.